PM Modi : 400 రోజులే ఉంది- వారిని టార్గెట్ చేయండి- బీజేపీ నేతలకు మోడీ కీలక సూచన..

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ఇవాళ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అంతే కాదు వచ్చే 400 రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు మరో 400 రోజులు మాత్రమే ఉందని, ఆ లోపు దేశంలోని అన్ని వర్గాలకు చేరువ కావాలని బీజేపీ నేతలకు జాతీయ కార్యవర్గ భేటీలో ప్రధాని మోడీ సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకు వీలైన అన్ని మార్గాలను వాడుకోవాలని ప్రధాని మోడీ వారిని కోరారు. మనం చరిత్ర సృష్టించాల్సి ఉందన్నారు. రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో మోడీ వ్యాఖ్యల్ని మహారాష్ట్రకు చెందిన పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.

pm modi directs bjp leaders to reach out 18-25 year youth in next 400 days, key comments

ప్రధానంగా 18 నుంచి 25 ఏళ్ల యువతపై బీజేపీ నేతలు దృష్టిసారించాలని ప్రధాని మోడీ బీజేపీ నేతలకు సూచించారు. వారికి చరిత్ర గురించి ఎక్కువగా తెలియదని, అలాగే గత ప్రభుత్వాలు ఏం చేశాయో కూడా వారికి తెలియదని ప్రధాని మోడీ బీజేపీ నేతలతో చెప్పినట్లు ఫడ్నవీస్ వెల్లడించారు. యువతకు ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన కల్పించి సుపరిపాలనలో భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నించాలని బీజేపీ నేతలకు ప్రధాని మోడీ సూచించారు. దీంతో ప్రధాని మోడీ చేసిన సూచనల్ని అమలు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+