PM Modi: స్వాతంత్ర సమరయోధుడిగా మోడీ ...! తీవ్ర విమర్శలు, ట్రోలింగ్స్..!
ప్రధాని మోడీని (PM Modi) ఆయన అభిమానులు ఇప్పటికే దేవుళ్లతో పోలుస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు. గతంలో ఏ రాజకీయ నాయకుడికీ లేనంత స్ధాయిలో ఆయన్ను కొలుస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా స్వాతంత్ర సమరయోధుడిని చేసేశారు. భారత దేశానికి స్వాతంత్రం సాధించిపెట్టేందుకు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి, తమ జీవితాల్ని ధారపోసిన, ఆత్మత్యాగాలు చేసుకున్న స్వాతంత్ర సమరయోధుల జాబితాలో మోడీని కూడా చేరుస్తూ తాజాగా ఓ పాఠ్యపుస్తకాన్ని ప్రచురించారు. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఒక పాఠశాల పుస్తకానికి సంబంధించిన పేజీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీసింది. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో ప్రధాని మోదీ పేరును, ఆయన చిత్రాన్ని చేర్చడం పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి చారిత్రాత్మక వీరుల పక్కన మోదీ ఫోటోను ముద్రించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. స్వాతంత్ర్య పోరాటానికి ప్రత్యేకంగా కేటాయించిన ఒక అధ్యాయంలో ప్రస్తుత దేశ ప్రధాని పేరును స్వాతంత్ర్య సమరయోధుడిలా చేర్చడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేంద్ర మోదీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మూడేళ్ల తర్వాత, అంటే 1950 సెప్టెంబర్ నెలలో జన్మించారని, అలాంటి వ్యక్తిని చారిత్రక వీరులతో పోలుస్తూ స్వాతంత్ర్య సమరయోధుడిగా ఎలా చిత్రీకరిస్తారని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

तो यह स्कूली किताबों में freedom fighter भी बन गए हैं?!?
— Supriya Shrinate (@SupriyaShrinate) September 7, 2026
ग़ज़ब फ्रॉड है भाई 🤦♀️🤦♀️ pic.twitter.com/DAdyDEH6sj
వైరల్ అవుతున్న ఆ పుస్తకంలోని పేజీలో స్వాతంత్ర్య సమరయోధుల వివరాలతో పాటు వారు దేశం కోసం ఇచ్చిన ప్రసిద్ధ శీర్షికలను కూడా ఇచ్చారు. అయితే, ఆ స్వాతంత్ర్య నినాదాల పక్కనే ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన 'సబ్కా సాథ్, సబ్కా వికాస్', 'అచ్చే దిన్', 'మేక్ ఇన్ ఇండియా' వంటి రాజకీయ, ప్రభుత్వ నినాదాలను కూడా చేర్చారు. ఈ విచిత్రమైన కలయిక నెటిజన్లను, విద్యావేత్తలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. చారిత్రక స్వాతంత్ర్య శకంతో ఆధునిక ప్రభుత్వ ప్రచార నినాదాలను మిళితం చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది పసిపిల్లల మనస్సులలో చరిత్రను తప్పుగా ముద్రించి, భవిష్యత్తులో వారిని తప్పుదోవ పట్టించేలా చేసే పద్ధతి అని కొందరు తీవ్ర ఆందోళన చెందుతుండగా, మరికొందరు మాత్రం ఈ ముద్రణా లోపాన్ని తీవ్రంగా హేళన చేస్తూ రకరకాల మీమ్స్ సృష్టిస్తున్నారు. ఈ వివాదాస్పద పుస్తకం ఏ పాఠశాల బోర్డుకు చెందినది, ఏ పబ్లిషర్ దీనిని ముద్రించారు అనే అంశాలపై ఇంకా పూర్తిస్థాయిలో అధికారిక స్పష్టత రాలేదు.














Click it and Unblock the Notifications
