Green Cards: EB1 గ్రీన్ కార్డ్‌లకు బ్రేక్? సెప్టెంబర్ 30 నాటికి కోటా ఖాళీ!

అమెరికాలో స్థిరపడాలనే ఆశలతో ఉన్న భారతీయ ఐటీ నిపుణులు, అత్యున్నత ప్రతిభావంతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా పౌరసత్వం వైపు కీలక అడుగుగా భావించే EB-1 (Employment-Based First-Preference) కేటగిరీ గ్రీన్ కార్డ్‌ల జారీ ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే (సెప్టెంబర్ 30) నిలిచిపోయే ప్రమాదం ఉందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారతీయుల నుంచి ఈ కేటగిరీ కింద దరఖాస్తుల రాక అపారంగా పెరగడంతో, వారికి కేటాయించిన వార్షిక సీలింగ్ వేగంగా నిండిపోతోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

US Green Card Alert EB-1 Category for Indian Professionals May Become Unavailable Before September 30

అత్యంత డిమాండ్ ఉన్న కేటగిరీ.. ఎవరికి నష్టం?

సాధారణంగా EB-1 గ్రీన్ కార్డ్ కేటగిరీని అత్యున్నత ప్రతిభ కలిగిన శాస్త్రవేత్తలు, ఆచార్యులు, అంతర్జాతీయ సంస్థల సీనియర్ మేనేజర్లు , మల్టీనేషనల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు కేటాయిస్తారు. మిగతా గ్రీన్ కార్డ్ కేటగిరీల (EB-2, EB-3)తో పోలిస్తే ఇందులో వేగంగా పర్మనెంట్ రెసిడెన్సీ (గ్రీన్ కార్డ్) వస్తుందనే నమ్మకంతో ఎక్కువ మంది భారతీయులు దీనిపైనే ఆధారపడుతున్నారు.

అయితే, భారత కోటా పరిమితి ముగిసే దశకు చేరుకోవడంతో.. నిర్దేశిత గడువు కంటే ముందే కొత్తగా ఈ కేటగిరీ కింద వీసాలు లేదా గ్రీన్ కార్డ్‌ల ఆమోదం లభించడం కష్టంగా మారనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే వరకు భారతీయులు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది.

గ్రాఫ్ మారని కటాఫ్ తేదీలు.. ఆర్ధిక సంవత్సరపు నిబంధనలే కారణం!

సెప్టెంబర్ నెల వీసా బులెటిన్ ప్రకారం.. భారతీయుల EB-1 ఫైనల్ యాక్షన్ డేట్ అక్టోబర్ 15, 2022 వద్దే మార్పు లేకుండా నిలిచిపోయింది. అంటే ఈ తేదీ కంటే ముందు ప్రియారిటీ డేట్ ఉన్న దరఖాస్తుదారులకు మాత్రమే ఆమోదం లభిస్తుంది. అమెరికా చట్టాల ప్రకారం, ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌లలో ఏ ఒక్క దేశానికి కూడా మొత్తం వార్షిక పరిమితిలో 7 శాతానికి మించి వీసాలు ఇవ్వకూడదనే కఠిన నిబంధన (Per-Country Cap) ఉనికిలో ఉంది. భారత్ నుంచి ఏటా వేలాది మంది దరఖాస్తు చేసుకుంటుండటంతో ఈ చట్టబద్ధమైన 7 శాతం సీలింగ్ అతి త్వరలోనే ముగిసిపోతోంది.

మిగతా కేటగిరీల పరిస్థితి మరీ ఘోరం!

ఒక్క EB-1 మాత్రమే కాదు.. ఇతర కేటగిరీలలోనూ భారతీయుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ఉన్నత చదువులు పూర్తి చేసిన నిపుణుల కోసం ఉద్దేశించిన EB-2 కేటగిరీ సెప్టెంబర్ నెలలో భారతీయులకు అసలు లభ్యం కావడం లేదని స్పష్టమైంది. అలాగే EB-3 (స్కిల్డ్ వర్కర్స్) కేటగిరీ ప్రయారిటీ డేట్ జనవరి 1, 2014 దగ్గరే ఆగిపోవడంతో.. దశాబ్ద కాలానికి పైగా దరఖాస్తుదారులు వెయిటింగ్ లిస్ట్‌లోనే నలిగిపోతున్నారు. మరోవైపు పెట్టుబడిదారుల కేటగిరీ అయిన EB-5 అన్‌రిజర్వ్‌డ్ లోనూ కొత్త ఆమోదాలు నిలిచిపోయాయి. దీనితో హెచ్-1బీ (H-1B) వీసాలపై అమెరికాలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు మళ్లీ సందిగ్ధంలో పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+