పట్టాలెక్కిన తొలి హైస్పీడ్ మెట్రో, కళ్లు చెదిరే ప్రత్యేకతలు - తెలుగు రాష్ట్రాల్లో..!!
దేశంలో తొలిసారి 120కిలోమీటర్ల వేగంతో మెట్రో సర్వీసు అందుబాటులోకి వచ్చింది. తొలి హైస్పీడ్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. హైస్పీడ్ ఇంటర్‌సిటీ ప్రయాణం ఉద్యమానికి ఈ చర్య కీలక ముందడుగు కానుంది. ఈ సందర్భంగా 82 కిలోమీటర్ల దిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. భారత్‌లోని తొలి నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సెక్షన్‌లను ప్రారంభోత్సవం చేసిన ప్రధాని.. రైల్వే వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల పైన సంతోషం వ్యక్తం చేసారు. కాగా.. ముంబై హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ వేగవంతం చేసే విధంగా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.
ఉత్తర ప్రదేశ్‌లోని శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మీరఠ్ మెట్రో, నమో భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నమో భారత్ భారత తొలి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నమో భారత్ రైళ్లు 160 కి.మీ.ల వేగంతో ప్రయాణం చేసే సామర్ధ్యంతో తీర్చి దిద్దారు. ఈ మెట్రో ప్రాజెక్ట్ ఢిల్లీ -మీరట్ కారిడార్ 82.15 కి.మీ. విస్తరించి, ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్‌ను మీరట్‌లోని మోడీపురంతో కలుపుతుంది. ఇది భారతదేశంలో మొట్టమొదటి రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. సాంప్రదాయ మెట్రో వ్యవస్థల కంటే వేగంగా విస్తృత ప్రాంతంలోని ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానం కోసం రూపొందించిన సెమీ-హై స్పీడ్ రైలు కొత్త అధ్యాయం కానుంది. ఈ కారిడార్‌లో ఆనంద్ విహార్, ఘజియాబాద్, సాహిబాబాద్, మోడీనగర్, మురాద్‌నగర్, శతాబ్ది నగర్, మీరట్ సౌత్, మోడీపురం, బేగంపుల్ వంటి ప్రధాన స్టాప్‌లతో సహా 16 స్టేషన్లు ఉన్నాయి.

ఎన్నో ప్రత్యేకతలు... హై స్పీడ్ రైల్ కారిడార్లు
ఈ మెట్రోలో 2×2 సీటింగ్, ఓవర్ హెడ్ లగేజ్ ర్యాక్‌లు, మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సాకెట్లు, CCTV నిఘా, అగ్ని ప్రమాద గుర్తింపు వ్యవస్థలు ఇందులో ఉంటాయి. మహిళల కోసం ప్రత్యేక కోచ్ ఏర్పాటు చేశారు. ఇండియన్ రైల్వేస్ ఏడు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రారంభించనుంది. ఈ మేరకు 2026 కేంద్ర బడ్జెట్లో 7 కొత్త హై స్పీడ్ కారిడార్లను ప్రకటించారు. ఢిల్లీ నుండి వారణాసి, ముంబై నుండి పూణే మరియు చెన్నై నుండి బెంగళూరు వరకు కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అదే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లోని మెట్రో నగరాల కనెక్టివిటీ కి వీలుగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కేంద్రం తాజాగా ప్రకటించిన ఏడు హై స్పీడ్ కారిడార్లలో ముంబై హైదరాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ కు స్థానం దక్కింది. వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రవేశం తో రైల్వే వ్యవస్థలో కొత్త మార్పు మొదలైంది. అదే విధంగా అమృత్ భారత్ రైళ్లను విస్తరిస్తున్నారు. ఇప్పుడు ఈ హైస్పీడ్ మెట్రో ద్వారా ప్రయాణీకులకు మరింత ప్రయోజనం దక్కనుంది.












Click it and Unblock the Notifications