సీఎంల సమావేశంలో ప్రధాని మోడీ... మమతా, ఒమర్ గైర్హాజరు (ఫోటోలు)

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ భేటీలో భాగంగా ప్రణాళిక సంఘం రద్దు, దాని స్థానంలో కొత్త కమిటీ ఏర్పాటు తదితరాల అంశాలపై చర్చ జరిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలను ప్రధాని మోడీ స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రణాళికా విధానంలో కింద నుంచి పైస్ధాయి వరకు మార్పు రావాలని అన్నారు. దేశంలో ప్రణాళికా సంఘం స్ధానంలో సుస్ధిరమైన సంస్ధ ఏర్పాటు కావాలని అన్నారు. దేశానికి అవసరమైన విధానాలు రూపొందించేలా వ్యవస్ధ ఉండాలని మోడీ చెప్పారు.

అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా గైర్హాజరయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్ధికశాఖమంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వైఖరిపట్ల అసంతృప్తితో ఒమర్‌ అబ్దుల్లా, బెంగాల్‌ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపుతోందనే ఆరోపణలతో సీఎం మమతా సమావేశానికి హాజరుకాలేదని సమాచారం.

 సీఎంల సమావేశంలో మోడీ

సీఎంల సమావేశంలో మోడీ

ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రణాళికా విధానంలో కింద నుంచి పైస్ధాయి వరకు మార్పు రావాలని అన్నారు. దేశంలో ప్రణాళికా సంఘం స్ధానంలో సుస్ధిరమైన సంస్ధ ఏర్పాటు కావాలని అన్నారు. దేశానికి అవసరమైన విధానాలు రూపొందించేలా వ్యవస్ధ ఉండాలని మోడీ చెప్పారు.

 సీఎంల సమావేశంలో మోడీ

సీఎంల సమావేశంలో మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.

 సీఎంల సమావేశంలో మోడీ

సీఎంల సమావేశంలో మోడీ

ఈ భేటీలో భాగంగా ప్రణాళిక సంఘం రద్దు, దాని స్థానంలో కొత్త కమిటీ ఏర్పాటు తదితరాలపై చర్చ జరిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలను ప్రధాని మోడీ స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరిగింది.

 సీఎంల సమావేశంలో మోడీ

సీఎంల సమావేశంలో మోడీ

అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్ధికశాఖమంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు.

 సీఎంల సమావేశంలో మోడీ

సీఎంల సమావేశంలో మోడీ

సాయంత్రం 4 గంటల వరకు సమావేశం జరిగింది. అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా గైర్హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+