ఆహార ధాన్యాల ఉత్పత్తితో భారత్ చారిత్రాత్మక రికార్డు: పీఎం మోదీ ఏం చెప్పారంటే!
దేశం వ్యవసాయ రంగంలో 357మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో చారిత్రాత్మక రికార్డును నెలకొల్పిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తన మనసులోని ఆలోచనలను దేశ, విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 128వ ఎపిసోడ్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన ప్రధాని మోదీ 10 సంవత్సరాల కిందటితో పోలిస్తే భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 100 మిలియన్ టన్నులు పెరిగిందన్నారు. దేశ ప్రగతికి ఇది దోహదం చేస్తుందన్నారు.
తేనే ఉత్పత్తిలోనూ కొత్త రికార్డులు: ప్రధాని మోడీ
తేనె ఉత్పత్తిలో దేశం కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోందని, 11 సంవత్సరాల కిందట 76 వేల మెట్రిక్ టన్నులు ఉన్న తేనె ఉత్పత్తి.. ఇప్పుడు ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చేరిందన్నారు. తేనె ఎగుమతులు కూడా మూడు రెట్లు పెరిగాయని, హనీ మిషన్ కార్యక్రమం కింద ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థ 2లక్షల 25వేలకు పైగా తేనెటీగల పెట్టెలను ప్రజలకు పంపిణీ చేసిందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజిన్ హైదరాబాద్ లో
ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్లో మాత్రమే దొరికే రాంబన్ సులాయి తేనెకు జీఐ ట్యాగ్ లభించడాన్ని నరేంద్రమోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న పలు తేనె ఉత్పత్తుల గురించి కూడా ప్రధాని చెప్పారు. హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజిన్ MRO- మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్-సౌకర్యాన్ని కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభించిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తావించారు.
ఇస్రో డ్రోన్ల పోటీపై మోదీ
దేశం విమాన నిర్వహణ, మరమ్మత్తు, పునఃపరిశీలన రంగంలో ఈ ప్రధాన అడుగు వేసిందన్నారు. అలాగే, గతవారమే హైదరాబాద్ లో ప్రారంభించిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ భారతదేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిచ్చిందన్నారు. ఇస్రో డ్రోన్ల పోటీలో వైఫల్యాన్ని అధిగమించిన యువకుల స్ఫూర్తి కొద్ది రోజుల క్రితం తన ద్రుష్టిని ఆకర్షించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు.
చంద్రయాన్ 2 ఫెయిల్ అయినా చంద్రయాన్ 3 సక్సెస్
అంగారక గ్రహ వాతావరణంలో డ్రోన్ లను ఎగురవేయడానికి ప్రయత్నించిన పుణె యువకుల బృందాన్ని అభినందించారు. చాలాసార్లు తమ డ్రోన్లు విఫలమైనా పట్టుదలతో ప్రయత్నించడంతో చివరకు అంగారక గ్రహ వాతావరణంలో డ్రోన్ ఎగరగలిగిందన్నారు. ఆ వీడియో చూస్తున్నప్పుడు చంద్రయాన్ 2 సంబంధం తెగిపోయిన సందర్భం తనకు గుర్తొచ్చిందని, శాస్త్రవేత్తలు కూడా పట్టుదలతో చంద్రయాన్ 3 విజయగాథ రాసి విజయం సాధించారని నరేంద్రమోదీ తెలిపారు.
ఓకల్ ఫర్ లోకల్ పై పీఎం మోదీ
మన యువత అంకితభావం, మన శాస్త్రవేత్తల నిబద్ధత గొప్పదని, యువతరం చూపే ఈ అంకితభావం వికసిత భారతదేశానికి గొప్ప బలం అని ప్రధాని ప్రశంసించారు. అందరూ 'వోకల్ ఫర్ లోకల్' అనే మంత్రాన్ని పాటించాలన్నారు. జీ 20 శిఖరాగ్ర సమావేశంలో పలు దేశాల అధినేతలకు తాను అందజేసిన బహుమతుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీపై మోదీ వ్యాఖ్యలు
జపాన్ ప్రధానమంత్రికి కరీంనగర్ సిల్వర్ క్రాఫ్ట్ నైపుణ్యాన్ని ఆవిష్కరించే వెండి బుద్ధ ప్రతిరూపాన్ని, ఇటలీ ప్రధానమంత్రికి కూడా కరీంనగర్ సంప్రదాయిక లోహ శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేసే పూల ఆకృతులతో కూడిన వెండి అద్దం బహుమతిగా ఇచ్చానని ప్రధానమంత్రి చెప్పారు.
దేశంలో శీతాకాల పర్యాకటంపై మోదీ
దేశంలో శీతాకాల పర్యాటకానికి అన్ని అవకాశాలు ఉన్నాయని, ఈ సీజన్ లో యాత్రను ప్లాన్ చేసుకునేవాళ్లు.. ఖచ్చితంగా హిమాలయ లోయలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఔలి, మన్ స్యారీ, చోప్టా, డెయారా వంటి ప్రదేశాలు శీతాకాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయన్నారు. ఉత్తరాఖండ్ లో జరిగే శీతాకాల క్రీడలను గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications