వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిపిన్ రావత్ , అమరులకు ప్రధాని, త్రివిధ దళాధిపతుల నివాళి-పాలం ఎయిర్ బేస్ లో విషాదఛాయలు

|
Google Oneindia TeluguNews

నిన్న తమిళనాడులోని కున్నూర్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, ఇతర అమర వీరుల మృతదేహాలు ఢిల్లీ పాలం ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. సూలూరు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన మృతదేహాలు పాలం ఎయిర్ బేస్ కు చేరుకున్నాయి. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

 pm modi, nsa ajit doval and families condoles bipin rawat and other bereaved

నిన్న తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ మరియు ఇతర 11 మంది సాయుధ దళాల సిబ్బందికి నివాళులర్పించేందుకు ప్రధాని మోడీ పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఆయన నివాళులు అర్పించారు. ఆ తర్వాత రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, మృతుల కుుంబాలకు నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి.

అనంతరం త్రివిధ దళాధిపతులైన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ , ఇతర అమరవీరులకు చివరి నివాళులు అర్పించారు. మరోవైపు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ LS లిడర్, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ మృతదేహాలను మాత్రమే ఇప్పటివరకు గుర్తించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్ధ తెలిపింది.

Recommended Video

History of Air Crashes in India

అటు ఢిల్లీ చేరుకున్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌, ఆయన భార్య మధులికా రావత్ భౌతిక కాయాలకు రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయన కరాజ్ మార్గ్ నివాసంలో పౌరులు నివాళులర్పించేందుకు అవకాశం కల్పిస్తారు. సైనిక సిబ్బంది మధ్యాహ్నం 12.30 నుంచి 13.30 గంటల వరకు నివాళులర్పిస్తారు. అనంతరం ఢిల్లీ కాంట్ బ్రార్ స్క్వేర్‌లో అంత్యక్రియల కోసం పార్థివ దేహాన్ని బ్యారెల్ క్యారేజీలో తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు ఉంటాయి.

English summary
prime minister narendra modi and other vips, families of the bereaved bipin rawat and others paid tributes in palam airbase today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X