Chandrayan-3: మిషన్ చంద్రయాన్ సక్సెస్.. శాస్త్రవేత్తలకు ప్రధానీ మోదీ అభినందనలు..

Chandrayan-3: చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా జరగటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన నేరుగా అక్కడి నుంచే ప్రయోగాన్ని వీడియో కాన్ఫరెన్స్ రూపంలో పర్యవేక్షించారు.

చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్ర్తవేత్తలను కృషిని కొనియాడారు. దీంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని మోదీ అన్నారు. చంద్రయాన్ సూపర్ సక్సెస్ మరీ కీలకమైన మైలురాయిగా పేర్కొన్న ప్రధాని తన జీవితం ధన్యమైందని అన్నారు. స్పేర్ సైన్స్ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవంపై భారత్ విజయవంతంగా తన విక్రమ్ రోవర్ ను చేర్చటంలో సఫలం కావటం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi praised isro scientista over chandrayan3 success landing on moon south pole

చంద్రయాన్ విజయం దేశం గర్వించే మహత్తరమైన క్షణాలుగా ప్రధాని అభివర్ణించారు. దీంతో ఇండియా ప్రపంచపటంలో కొత్త చరిత్రకు నాంది పలికిందని అన్నారు. ఇది అమృతకాలంలో నెలకొన్న తొలి ఘన విజయం ఇదని ప్రధాని మోదీ వెల్లడించారు. తాను దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైనప్పటికీ తన మనసంతా చంద్రయాన్-3పైనే ఉందని చెప్పారు.

మెుదటి సారి విఫలమైనప్పటికీ రెండవ ప్రయత్నంలో చంద్రునిపైకి రోవర్ దింపే క్లిష్టమైన ప్రక్రియను పూర్తి చేయటం సంతోషంగా ఉందని.. ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ప్రధాని మోదీ చెప్పారు. అద్భుతమైన ఈ విజయం కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఎదురుచూశారని మోదీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+