విపక్షాల అవిశ్వాసాన్ని మోడీ 2019లోనే ఊహించారా ? -వీడియో వైరల్..

కేంద్రంలోని మోడీ సర్కార్ పై విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మద్దతుతో ఇవాళ లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. అన్ని పార్టీలతో చర్చించి తీర్మానంపై చర్చకు సమయం, ముహుర్తం ఖరారు చేస్తానని కూడా ప్రకటించారు. దీంతో త్వరలో అవిశ్వాస తీర్మానంపై లోక్ సభ చర్చించబోతోంది. మణిపూర్ లో జరుగుతున్న ఘటనలపై కేంద్రం నిర్లిప్తతను నిరసిస్తూ కాంగ్రెస్ పెట్టిన ఈ తీర్మానం నెగ్గే అవకాశాలు తక్కువే. అయితే దీనిపై ఆసక్తికర చర్చలు మాత్రం జరుగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఇవాళ లోక్ సభలో ఎన్డీయే సర్కార్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ 2019లోనే ఊహించారా అంటే అవునని నిరూపించే ఓ వీడియో ఇవాళ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మోడీ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే తన ప్రభుత్వంపై కచ్చితంగా విపక్షాలు 2023లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని అంత కచ్చితంగా ఎలా అంచనా వేశారన్నది అంతు బట్టడం లేదు. దీంతో ఈ వీడియో ఇవాళ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

modi3

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం పార్లమెంటులో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 2019లో పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ వ్యాఖ్య వైరల్‌గా మారింది. అధికార బీజేపీలో చాలా మంది దీనిని మోడీ అంచనాగా పేర్కొంటున్నారు. బడ్జెట్ సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సంబంధించిన 7 ఫిబ్రవరి 2019 నాటి వీడియోలో 2023లో మరో అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధం కావాలని ప్రధాని చెప్పడం వినిపించింది. అంతకు ముందు ఏడాది విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని తన ప్రభుత్వం ఓడించడాన్ని మోడీ ప్రస్తావించారు.

ఈ వీడియోలో మోడీ విపక్షాలకు శుభాకాంక్షలు. ఎందుకంటే 2023లో మళ్లీ అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి మీకో అవకాశం వచ్చేలా సిద్ధంగా ఉండాలని కోరారు. దీంతో అధికార పార్టీ ఎంపీల నుండి నవ్వులు, డెస్క్‌లు కొట్టడం కనిపించింది. ఈ వీడియోలో మోడీ ఇంకా.. ఇదీ సేవ అంటే ఇద్దరు ఎంపీల నుంచి మనం ఇక్కడ అధికారంలో కూర్చున్నాం. అహంకార ఫలితంగా 400 నుంచి 40కి దిగజారడం.. ఈరోజు ఎక్కడున్నారో చూడు..అని కాంగ్రెస్‌ పేరు చెప్పకుండానే మోడీ విపక్షాన్ని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు కూడా అక్కడే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+