• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ యూఎస్ టూర్ సక్సెస్-65 గంటల్లో 24 మీటింగ్స్-బైడెన్, హ్యారిస్ భేటీలు-క్వాడ్, ఐరాస ప్రసంగాలు

|

ప్రధాని మోడీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ఇవాళ భారత్ చేరుకున్నారు. న్యూఢిల్లీలో అడుగుపెట్టిన ప్రధానికి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎదురేగి స్వాగతం పలికారు. బిజీ బిజీగా సాగిన అమెరికా పర్యటనలో ఈసారి ప్రధాని మోడీ పలు కీలక ఫలితాలను రాబట్టారు. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని, ఐరాసలో భారత్ శాశ్వత సభ్యత్వానికి వారి మద్దతు పొందగలిగారు. అదే సమయంలో ఐరాస సాధారణ సభలో భారత్ వాణిని గట్టిగా వినిపించగలిగారు. దీంతో ప్రధాని అమెరికా టూర్ విజయవంతమైనట్లయింది.

 మోడీ అమెరికా టూర్

మోడీ అమెరికా టూర్

ప్రధాని మోడీ మూడు రోజుల అమెరికా టూర్ ఆద్యంతం బిజీబిజీగా సాగిపోయింది. భారత్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లిన ప్రధాని అక్కడ ముందుగా ఐదు కార్పోరేట్ దిగ్గజ సంస్ధల సీఈవోలతో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న దేశంగా భారత్ కు ఉన్న అనుకూలతల్ని వారికి తెలిపారు.

ఆ తర్వాత గంటల వ్యవధిలోనే అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు జో బైడెన్, కమలా హ్యారిస్ ను కలుసుకున్నారు. ఆ తర్వాత ఐరాసకు వెళ్లి అక్కడి సాధారణ సభలో ప్రసంగించారు. చివరికి భారత్ కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడి బైడెన్ చెప్పేలా చేశారు.

65 గంటల్లో 24 మీట్ంగ్స్

65 గంటల్లో 24 మీట్ంగ్స్

ప్రధాని మోడీ తన అమెరికా పర్యటన ఆద్యందం బిజీబిజీగా గడిపారు. గతంలో నమస్తే ట్రంప్ వంటి టైంపాస్ ప్రచార కార్యక్రమాలకు హాజరైన ప్రధాని... ఈసారి మాత్రం తన పర్యటనను మాత్రం పూర్తిస్ధాయిలో వినియోగించుకునేందుకే ఆసక్తి చూపారు. ఇందులో భాగంగా ప్రవాస భారతీయులు, కార్పోరేట్ సంస్ధల సీఈవోలు, అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఐరాసలో కీలక అధికారులతో వరుసగా భేటీలు అయ్యారు. దీంతో కేవలం 65 గంటల్లోనే మోడీ ఏకంగా 24 సమావేశాల్లో పాల్గొని అరుదైన రికార్డు సృష్టించారు. ఇవన్నీ భారత్ కోణంలో చూస్తే ద్వైపాక్షిక సంబంధాల పరంగానూ, పెట్టుబడుల పరంగానూ, అంతర్జాతీయంగా ఉపయోగపడే సమావేశాలే కావడం ఇక్కడ విశేషం.

ఆప్ఘన్ భవిష్యత్తుపై కీలక చర్చలు

ఆప్ఘన్ భవిష్యత్తుపై కీలక చర్చలు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన రాకతో మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో ప్రధాని మోడీ కీలక చర్చలు జరిపారు. ఇందులో తాలిబన్ల రాక వల్ల ఏర్పడుతున్న పరిణామాలు, ఆప్ఘనిస్తాన్ లో పెరుగుతున్న ఉగ్రవాదం, దానికి పాకిస్తాన్ అందిస్తున్న సహకారం వంటి పలు అంశాల్ని మోడీ ప్రస్తావించగలిగారు. దీంతోపాటు ఆప్ఘన్ గడ్డపై నుంచి ఏ విదేశానికీ వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీంతో ఆప్ఘన్ విషయంలో కలిసొచ్చేందుకు అమెరికా కూడా అంగీకారం తెలిపింది. ప్రస్తుతానికి ఆప్ఘన్ గడ్డను అమెరికా బలగాలు వీడినా భవిష్యత్తులో అవసరాన్ని బట్టి జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చింది.

పాకిస్తాన్ కు చెక్ పెట్టే వ్యూహాలు

పాకిస్తాన్ కు చెక్ పెట్టే వ్యూహాలు

ఆప్ఘనిస్తాన్ లో మారిన పరిస్ధితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్న పొరుగుదేశం పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ తన టూర్ ను విజయవంతంగా వాడుకున్నారు. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులకు పాకిస్తాన్ కుయుక్తుల గురించి వివరించారు. కశ్మీర్ సహా ఇతర వ్యవహారాల్లో పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలు వాడుకుంటున్నట్లు వారికి తెలిపారు. చివరికి ఐరాసలో సైతం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు దౌత్యవేత్త స్నేహా దూబేతో చెక్ పెట్టించడం తో పాటు తాను సైతం 26/11 ముంబై దాడుల దోషుల్ని శిక్షించే విషయంలో పాకిస్తాన్ ను కార్నర్ చేయగలిగారు.

ఐరాసలో బలంగా భారత్ వాణి

ఐరాసలో బలంగా భారత్ వాణి

ఐక్యరాజ్యసమితి 76వ సాధారణ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. భారత్ కు ఉన్న అనుకూలతలు, పెట్టుబడి అవకాశాలు, దేశ యువత, ఉగ్రవాద సమస్యపై మన వాణిని గట్టిగా వినిపించారు. భారత్ ఎప్పటికీ ట్రెండ్ సెట్టరేనని, తాము చేపట్టే ప్రతీ పనినీ ఆ తర్వాత మిగతా దేశాలు ఫాలో అవుతాయని మోడీ చెప్పుకొచ్చారు కోవిడ్ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీతో పాటు ఓ టీ అమ్ముకునే వాడిని ప్రధానిగా చేసిన ఘనత భారత్ దేనని ఐరాస సర్వప్రతినిధుల సభలో చెప్పుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యలు, ఉగ్రవాద బాధితులుగా మారుతున్న తీరు, కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి, ప్రపంచ దేశాలకు వాటిని ఇచ్చిన విధానం వంటి అంశాలపై ప్రధాని మోడీ సమగ్రంగా ఐరాస సభ్య దేశాలకు వివరించారు.

 మోడీ టూర్ గ్రాండ్ సక్సెస్

మోడీ టూర్ గ్రాండ్ సక్సెస్

ప్రధాని మోడీ: అమెరికా టూర్ ముగించుకుని ఇవాళ దేశంలో అడుగుపెట్టారు. ఈ సమయంలో ప్రధాని భారత్ కు ఉత్పాదక ద్వైపాక్షిక, బహుపాక్షిక సంబంధాలు ఉన్నాయని, రాబోయే సంవత్సరాల్లో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తన మూడు రోజుల పర్యటనలో, స్వదేశానికి వచ్చే ముందు మోదీ చేసిన ట్వీట్‌లో, అమెరికాలో తన టూర్ సందర్భంగా ఉత్పాదక ద్వైపాక్షిక, బహుపాక్షిక సంబంధాలు నెలకొల్పినట్లు తెలిపారు.

గత కొన్ని రోజులుగా, ఉత్పాదక ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక నిశ్చితార్థాలు, CEO లతో పరస్పర భేటీలు, ఐరాస సాధారణ సభలో ప్రసంగం వంటి విషయాల్ని పంచుకున్నారు. రాబోయే రోజుల్లో ఇండియా-యుఎస్ఎ సంబంధాలు మరింత బలంగా పెరుగుతాయని తనకు నమ్మకం ఉందన్నారు.

English summary
prime minister narendra modi has reached new delhi after his hectic US tour of 65 hours including key meetings with joe biden and kamala harris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X