హిజాబ్ వివాదంపై స్పందించిన మోడీ-మహిళల హక్కులు అణగదొక్కలేరని వ్యాఖ్య
కర్నాటకలో మొదలైన ముస్లిం మహిళల హిజాబ్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దీనిపై స్పందించారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షహరాన్ పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోడీ హిజాబ్ వివాదంపై తనదైన ఖైలిలో వ్యాఖ్యలు చేశారు.
కర్నాటకలో చోటు చేసుకున్న హిజాబ్ వివాదంపై యూపీలోని షహరాన్ పూర్ ర్యాలీలో స్పందించిన ప్రధాని మోడీ.. ముస్లిం మహిళల హక్కుల్ని దూరం చేసేందుకు కొందరు కొత్త దారులు వెతుక్కుంటున్నారని వ్యాఖ్యానించారు. యూపీలో తన మొదటి తొలి భౌతిక ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతదేశంలో "ముస్లిం మహిళల హక్కులు, అభివృద్ధిని నిరోధించడానికి ప్రజలు కొత్త మార్గాలను కనుగొంటున్నారని తెలిపారు. ముస్లిం మహిళలు అణచివేయబడకుండా చూసేందుకు ఉత్తరప్రదేశ్‌లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అవసరమని మోడీ అన్నారు.

హిజాబ్‌లు ధరించారనే కారణంతో ఆరుగురు బాలికలను తమ కళాశాలలోకి అనుమతించకుండా జనవరిలో కర్ణాటకలో దుమారం చెలరేగింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో హిజాబ్ వివాదంపై స్పందించాలని విపక్షాలు కోరుతున్నా స్పందించకుండా.. యూపీ ప్రచారంలోనే మోడీ దీనిపై మాట్లాడటం విశేషం.












Click it and Unblock the Notifications