మోడీ ఆస్తులు ఎంతో తెలుసా?: పెరుగుదల నమోదు!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా పుస్తకాల మీద రాయల్టీ కూడా వస్తుండటంతో ఈ పెరుగుదల నమోదైంది. కాగా, మోడీ తొలిసారిగా పుస్తక రాయల్టీని ప్రస్తావించారు. ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన వివరాల ప్రకారం మోడీ ఆస్తుల విలువ రూ.1.73కోట్లు.

2014-15లో ఆయన ఆస్తి విలువ రూ.1.41కోట్లు కాగా, గత ఏడాదితో పోల్చితే 22.6శాతం పెరిగాయి. ఇదే సమయంలో నగదు కూడా 19రెట్లు పెరిగింది. గత ఏడాది తన దగ్గర రూ.4700 ఉన్నట్లు చూపిన మోడీ.. ఈసారి రూ. 89,700 ఉన్నట్లు ప్రకటించారు. అలాగే పుస్తకాల రాయల్టీ ద్వారా రూ.12.35 లక్షల ఆదాయం వచ్చినట్లు చూపారు.

PM Modi's assets up Rs 32 lakh; books royalty new entry

గతంలో చూపిన 4 బంగారు ఉంగరాలను ఈసారి కూడా ప్రకటించారు. వాటి విలువ రూ.1.18 లక్షల నుంచి రూ.1.27 లక్షలకు చేరింది. కాగా, గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కోటి రూపాయల విలువైన ఆస్తి, అక్కడి ఎస్‌బీఐ సేవింగ్స్‌ ఖాతాలో రూ.2.09 లక్షలు, అదే బ్యాంకులో రూ.51.27 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి.

గత సంత్సరం ఈ మొత్తం రూ.31 లక్షలు మాత్రమే. వీటితోపాటు రూ.5.47లక్షల విలువైన ఎల్‌అండ్‌ టీ ట్యాక్స్‌ సేవింగ్స్‌ బాండ్లు, ఎల్‌ఐసీ, జాతీయ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా, భార్య ఆస్తుల స్థానంలో 'తెలియదు' అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+