‘ఇండియా’కు బర్త్‌డే విషెస్: జాంటీ రోడ్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన మోడీ
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూతురు ‘ఇండియా జియాన్నే’ పుట్టిన రోజున ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఆదివారం ‘ఇండియా’ తన రెండో పుట్టినరోజు జరుపుకుంది.
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూతురు 'ఇండియా జియాన్నే' పుట్టిన రోజున ఆమెకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. ఆదివారం 'ఇండియా' తన రెండో పుట్టినరోజు జరుపుకుంది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఆ పాపకు మొత్తం భారతదేశం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం.
ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా 'హ్యాపీ బర్త్‌డే ఇండియా ఫ్రమ్ ఇండియా' అని శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఇండియాకి ఏకంగా 1.2 బిలియన్ మంది సోషల్‌మీడియా ద్వారాపుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినట్లయింది. కాగా, తన కూతురు జన్మదినం సందర్భంగా జాంటీ రోడ్స్ ఒక ఫొటోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

కాగా, ప్రధాని మోడీ 120కోట్ల మంది భారతీయుల తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడంతో జాంటీ రోడ్స్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. మోడీ ట్వీట్ చేసిన 12గంటల్లోనే దాదాపు 6300సార్లకుపైగా ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మోడీకి.. రోడ్స్ ధన్యవాదాలు తెలిపారు.
Happy Birthday baby India; 2 today #landofyourbirth pic.twitter.com/RGVxmXRjRv
— Jonty Rhodes (@JontyRhodes8) April 23, 2017
Happy birthday to India, from India. :) https://t.co/DbOZFEKLe9
— Narendra Modi (@narendramodi) April 23, 2017
జాంటీ సొంత ప్రాంతం దక్షిణ ఆఫ్రికానే అయినా అతనికి మన భారత సంస్కృతి సంప్రదాయాలన్నా ఎంతో ఇష్టం. అందుకే తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా జాంటీ ఇండియా పేరిట హోమం కూడా జరిపించాడు.
2015లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ వ్యవహరిస్తున్న సమయంలోనే ఏప్రిల్ 23న ఇండియా ముంబైలో పుట్టింది. దీంతో జాంటీ మన భారతదేశంపై ఇష్టంతో కుమార్తెకు ఇండియా జియాన్నే అని పేరుపెట్టాడు.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications