Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సనాతన ధర్మం నిర్మూలనే ఇండియా కూటమి లక్ష్యం-మోడీ ఫైర్-దేశాన్ని బానిసగా మార్చే యత్నం..

తమిళనాడులో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షమైన డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోడీ ఇవాళ తీవ్రంగా తప్పుబట్టారు. దాన్ని మొత్తం ఇండియా కూటమికి అన్వయిస్తూ మోడీ తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి భారత్ లో సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇది దేశాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నమన్నారు.

సనాతన ధర్మాన్ని అంతమొందించాలని, దేశాన్ని వెయ్యేళ్ల క్రితం నాటి బానిసత్వంలోకి నెట్టాలని చూస్తున్నట్లు ప్రతిపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ విపక్షాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలో సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై జరిగిన వివాదంపై తొలిసారిగా ప్రధాని బహిరంగంగా స్పందించారు.

pm modi targets india front with sanatana, says they want to finish it

ఇటీవల ముంబైలో ఓ సమావేశం నిర్వహించి, అక్కడ 'ఘమాండీ'(అహంకార) కూటమిని ఎలా నడపాలనే విధానం, వ్యూహాన్ని విపక్షాలు నిర్ణయించుకున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. అలాగే వారు ఓ రహస్య ఎజెండాను కూడా నిర్ణయించుకున్నారన్నారు. భారతదేశ సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం అన్నారు. భారతీయుల విశ్వాసంపై దాడి చేయాలని, వేలాది సంవత్సరాలుగా దేశాన్ని ఏకం చేసిన ఆలోచనలు, విలువలు, సంప్రదాయాలను అంతం చేయాలని నిర్ణయించుకున్నాంటూ విపక్షాలపై మోడీ ఆరోపణలు చేశారు.

భారతదేశ వీరులు, సనాతన సంస్కృతికి మధ్య సంబంధాన్ని ప్రధాని మోడీ గుర్తుచేశారు. దేవి అహల్యాబాయి హోల్కర్‌కు స్ఫూర్తినిచ్చిన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని అహంకార విపక్ష కూటమి సంకల్పించిందని మోడీ విమర్శించారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సనాతనమే బలమన్నారు. బ్రిటిష్ వారిని సవాలు చేసి, ఆమె తన ఝాన్సీని వదులుకోనని చెప్పిందని మోడీ గుర్తుచేశారు.

మహాత్మాగాంధీ సనాతన ధర్మం తన జీవితానికి అవసరమని భావించారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన తన జీవితమంతా రాముడి నుండి ప్రేరణ పొందాడన్నారు. ఆయన చివరి మాటలు కూడా 'హే రామ్' అని మోడీ తెలిపారు. స్వామి వివేకానందుడు, లోకమాన్య తిలక్ కూడా సనాతన స్ఫూర్తిని పొందారని తెలిపారు. బ్రిటిష్ వారు ఉరితీసిన స్వాతంత్ర్య సమరయోధులను తిరిగి భరతమాత ఒడిలో పుట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పడానికి ఈ సంస్కృతే కారణమని ప్రధాని వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+