వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విలువైన సమాచారం: దేశ ప్రజలంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లో‌డ్ చేసుకోవాలి: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వ్యాధి ఎవరి నుంచి ఎవరికి సోకింది అక్కడి నుంచి ఈ మహమ్మారి మరెంతమందికి సోకిందనేది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన ప్రకటించగా కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రజలు కరోనావైరస్ బారిన పడే ప్రమాదం లేకుండా ఉండేందుకు లేదా గుర్తించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వశాఖ కొత్తగా ఆరోగ్య సేతు అనే ఒక మొబైల్ యాప్‌ను రూపొందించింది.

లాక్‌డౌన్ పొడిగింపు పై ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో ఆయన ఆరోగ్య సేతు యాప్ గురించి మాట్లాడారు. ఆరోగ్య సేతు యాప్‌ను స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాదు ఇతరులతో కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలని ప్రత్యేకంగా కోరారు. ఈ యాప్ మనలను జాగ్రత్త పరుస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. కరోనావైరస్ నియంత్రించేందుకు ఆ మహమ్మారిని ట్రాక్ చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. లొకేషన్ ట్రాకింగ్ టెక్నాలజీ ద్వారా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో టచ్‌లోకి వస్తే వెంటనే యాప్ అలర్ట్ చేస్తుందని వివరించారు. ఎక్కువ మంది ప్రజలు వినియోగించడం వల్ల ఈ యాప్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుందని చెప్పారు. బ్లూటూత్ టెక్నాలజీ , ఆల్గరిథమ్స్, మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వ్యక్తి ఎవరెవరితో మాట్లాడాడు దాని వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందనేది ఈ యాప్ తెలియజేస్తుంది.

Recommended Video

India Lockdown : Lockdown Extended Till May 3, PM Modi Speech Highlights
PM Modi Urges the nation to install Arogya setu app, what is it all about and how it works?

ఒక్కసారి ఈ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్‌లో ఇన్స్‌టాల్ చేసుకుంటే.. దగ్గరలో ఉన్న ఆరోగ్య సేతు ఇన్స్‌స్టాల్ చేసి ఉన్న స్మార్ట్ ఫోన్లను డిటెక్ట్ చేస్తుంది. ఇక ఎవరైనా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మరొకరితో కాంటాక్ట్‌లోకి వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది. అంతేకాదు ఎంత రిస్క్ ఉంటుందో కూడా లెక్కిస్తుంది. ఇందుకోసం కొన్ని పారామీటర్లను పరిగణలోకి తీసుకుంటుంది. దీని ఆధారంగా ఒక మనిషి కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఎంతమేరకు ఉందో ఆరోగ్య సేతు యాప్ తెలుపుతుంది. ఇక అధికంగా ఉంటే వెంటనే ప్రభుత్వానికి సమాచారం యాప్ చేరవేస్తుంది. ఇక ఇక్కడి నుంచి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఐసొలేషన్ అవసరమైతే ఆ చర్యలు కూడా తీసుకుంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మిమ్మలను మీరు కాపాడుకోవాలంటే వెంటనే మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని సురక్షితంగా ఉండండి. యాపిల్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11 భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

English summary
The ministry of electronics and IT launched a mobile app on Thursday called AarogyaSetu which will help people in identifying the risk of getting affected by the CoronaVirus.PM Modi had asked the nation to download this app.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X