వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాస్వామ్య పండుగలో భారీగా ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చెయ్యండి .. ఓటర్లకు పీఎం మోడీ పిలుపు

|
Google Oneindia TeluguNews

బీహార్ 2 వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది . బీహార్ లో 94స్థానాలకు నేడు రెండో దశ పోలింగ్ కొనసాగుతుంది . ఇదే సమయంలో మరో 10 రాష్ట్రాల్లోని 54 ఇతర స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు . ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓట్లు వెయ్యాలని కోరిన పీఎం నరేంద్ర మోడీ

ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓట్లు వెయ్యాలని కోరిన పీఎం నరేంద్ర మోడీ

నేడు, భారతదేశం అంతటా వివిధ ప్రదేశాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సీట్లలో ఓటు వేసే ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని, ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాను అని పిఎం నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. నేడు మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ స్థానాలకు, ఉత్తర ప్రదేశ్ లో 7 స్థానాలకు , గుజరాత్ లో 8 స్థానాలకు , ఛత్తీస్‌గడ్ లో ఒక స్థానానికి , హర్యానాలో ఒక స్థానానికి , జార్ఖండ్ లో 2 స్థానాలకు , కర్ణాటక లో 2 స్థానాలకు , నాగాలాండ్ లో 2 స్థానాలకు , ఒడిశా లో 2 స్థానాలకు , తెలంగాణలో 1 స్థానానికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని మోడీ విజ్ఞప్తి

ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని మోడీ విజ్ఞప్తి

మార్చిలో కరోనావైరస్ మహమ్మారి మొదలైన తర్వాత జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు భారతదేశంలో జరుగుతున్న మొదటి ప్రధాన ఎన్నికలు. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ఓటర్లు సామాజిక దూరాన్ని అనుసరించాలని, ఓట్లు వేసేటప్పుడు ఫేస్ మాస్క్‌లు ధరించాలని పిఎం మోడీ కోరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు జరుగుతుంది. ఓటర్లందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు .

కరోనా నిబంధనలను పాటిస్తూ ఓటెయ్యండి .. గుర్తుంచుకోండి .. మోడీ ట్వీట్

కరోనా నిబంధనలను పాటిస్తూ ఓటెయ్యండి .. గుర్తుంచుకోండి .. మోడీ ట్వీట్

సామాజిక దూర నిబంధనలను అనుసరించడం మరియు మాస్కులు ధరించడం అవసరం అని చెప్పిన మోడీ ఈ విషయాలను గుర్తుంచుకోండి! " అంటూ ప్రధాని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. బీహార్లో జరుగుతున్న ఎన్నికల్లో మూడు ప్రధాన పోటీదారుల మధ్య వార్ కొనసాగుతుంద. పాలక మరియు ప్రతిపక్ష కూటములు మరియు చిరాగ్ పాస్వాన్ యొక్క లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) బీహార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకవైపు జెడి (యు), బిజెపి, వికాషీల్ ఇన్సాన్ పార్టీ, జితాన్ రామ్ మంజి యొక్క హిందూస్థానీ అవామ్ మోర్చా, మరోవైపు రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి), కాంగ్రెస్, సిపిఐ-ఎంఎల్, సిపిఐ మరియు సిపిఐ (ఎం) కూటములు ఎన్నికల బరిలో సత్తా చూపించనున్నారు .

English summary
Prime Minister Narendra Modi encouraged voters to come out in large numbers to cast their votes as polling began for Phase 2 of Bihar assembly elections and for 54 other seats in 10 other states on Tuesday.“Today, there are by-polls taking place in various places across India. I urge those voting in these seats to vote in large numbers and strengthen the festival of democracy,” PM tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X