Lata Mangeshkar: ముంబైకి ప్రధాని మోడీ: శివాజీ పార్క్ భద్రత కట్టుదిట్టం
న్యూఢిల్లీ: ప్రఖ్యాత గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కన్నుమూశారు. ఆమె వయస్సు 92 సంవత్సరాలు. నెల రోజుల పాటు ఆమె అనారోగ్యంతో బాధపడ్డారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా వైరస్ బారిన పడటంతో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రెండు రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచారు డాక్టర్లు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈ ఉదయం 8:12 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం శివాజీ పార్కునకు తరలించనున్నారు. లతా మంగేష్కర్‌కు తొలుత కరోనా వైరస్ సోకింది. జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. జ్వరం తీవ్రమైంది. దీనితో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు.

కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ- తీవ్ర అనారోగ్యం వేధించింది. పలు అవయవాలు దెబ్బతిన్నాయి. దీనితో రెండు రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం మళ్లీ దిగజారింది. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీనితో ఆమెను డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ విషయం తెలుసుకుని ఆమె చెల్లెలు, ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే శనివారం రాత్రే బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అవయవాలు దెబ్బతినడం వల్ల లతా మంగేష్కర్ కన్నుమూశారని డాక్టర్ ప్రతీత్ సంధాని తెలిపారు.
బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని దాదార్‌లోని శివాజీ పార్క్‌కు తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా పలువురు మంత్రులు, వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, బాలీవుడ్ నటీనటులు, దర్శకులు, పారిశ్రామికవేత్తలు, మాజీ క్రికెటర్లు.. ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు లతా మంగేష్కర్ పార్ధివ దేహానికి నివాళి అర్పించనున్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ముంబై పోలీసులు.. శివాజీ పార్క్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లించారు. పలుచోట్ల బ్యారికేడ్లను అమర్చారు. ఆమె పార్థివ దేహానికి నివాళి అర్పించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముంబైకి వెళ్లనున్నారు. ఈ సాయంత్రం ఆయన ముంబైకి వెళ్తారని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. లతా మంగేష్కర్ మరణానికి సూచకంగా కేంద్ర ప్రభుత్వం రెండు రోజులను సంతాప దినాలుగా ప్రకటించింది. జాతీయ పతాకాన్ని అవనతం చేసింది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications