ప్రధాని మోదీకి బిగ్ లాస్..!!

PM Modi: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దేబ్రాయ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 69 సంవత్సరాలు. ఈ ఉదయం 7 గంటల సమయంలో దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు.

బిబేక్ దేబ్రాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తీరని లోటుగా పేర్కొన్నారు. సాటి లేని మేటి ఆర్థికవేత్తగా, చరిత్ర కారుడిగా, ఆధ్యాత్మికవేత్తగా అభివర్ణించారు.

PM Modi s economic advisory council Chairman Bibek Debroy passed away at the age of 69

బిబేక్ దేబ్రాయ్.. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక వ్యవహారాల సలహా మండలి ఛైర్మన్ వ్యవహరిస్తోన్నారు. మొత్తం 15 మంది సభ్యులు గల కౌన్సిల్ ఇది. డాక్టర్ షమికా దేవి, డాక్టర్ సజ్జద్ జెడ్ షెనాయ్, డాక్టర్ అశీమా గోయెల్, ప్రొఫెసర్ టీటీ రామ్మోహన్, నీలకంఠ మిశ్ర, డాక్టర్ పూర్ణిమా గుప్తా వంటి హేమాహేమీలు ఉన్నారీ టీమ్‌లో.

దీనికి బిబేక్ దేబ్రాయ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్నారు. ఆర్థిక విధానాలు, దీనికి సంబంధించిన వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోండటం, ఇందులో చేయాల్సిన మార్పుల గురించి ప్రధాని మోదీకి నేరుగా రిపోర్ట్ చేస్తుంటుంది ఈ మండలి. దేశ వృద్ధిరేటుపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటుంది.

స్థూల జాతీయోత్పత్తి మెరుగుపడటానికి అనుసరించాల్సిన అంశాలపై తరచూ అధ్యయనం చేస్తుంటుంది. జీడీపీ మరింత మెరుగుపడేలా సూచనలు చేయడం ఈ మండలి ముఖ్య కార్యకలాపాలు. గతంలో పలు నివేదికలను ప్రధాని మోదీకి అందించింది. వాటి ఆధారంగా ఆర్థిక విధానాల్లో మార్పులుచేర్పులు చేసింది కేంద్రం.

బిబేక్ దేబ్రాయ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పేగు సంబంధింత ఇబ్బందులకు గురయ్యారు. దీనితో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటోన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల మోదీ సంతాపం తెలిపారు.

బిబేక్‌తో సుదీర్ఘ అనుబంధం ఉందని, ఆర్థిక వేత్తగా దేశ గమనాన్ని మార్చివేశారని అన్నారు. ఆయనతో కలిసి పని చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తన మేథో సంపత్తితో అనేక రంగాలను పునరుజ్జీవింపజేశారని పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+