విమర్శలకు మోదీ కేంద్ర బిందువు అయ్యారా?: ఆ ఒక్క ప్రస్తావన

దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.

పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించారాయన. ఆపరేషన్ సింధూర్ మొదలుకుని సంక్షేమ పథకాల అమలు వరకు పలు విషయాలపై ప్రభుత్వ ఉద్దేశాలను వెల్లడించారు.

PM Modi s I-Day Praise for RSS Sparks Controversy Congress Questions Intentions

ఈ క్రమంలో అత్యంత సుదీర్ఘంగా ప్రసంగించారు. 103 నిమిషాల పాటు మాట్లాడారు. ఇది దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇంత సుదీర్ఘంగా ప్రసంగించలేదు. రెడ్ ఫోర్ట్ పై నుంచి ప్రధానులు చేసిన ప్రసంగాలన్నింటిలోకెల్లా అత్యంత సుదీర్ఘమైనది ఇదే.

ఈ క్రమంలో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను ప్రశంసించారు. మాతృభూమి సంక్షేమం, దేశ నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం కోసం గత వంద సంవత్సరాలుగా ఆర్‌ఎస్‌ఎస్ పని చేస్తోందని కితాబిచ్చారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి స్వయం సేవకులు తమ జీవితాలను అంకితం చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్‌జీఓ గా అభివర్ణించారు.

దీని పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విమర్శలు గుప్పించింది. తన పదవీ విరమణను అడ్డుకోవడానికే మోదీ ఇలా ఆర్ఎస్ఎస్ ను బుజ్జగిస్తోన్నారని ఆరోపించింది. 75 ఏళ్ల తర్వాత రాజకీయ నాయకులు పదవీ విరమణ చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ సూచించిన నేపథ్యంలో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి మోదీ ఈ ప్రస్తావన చేశారని చెబుతోంది.

ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ నాటికి మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రసన్నం చేసుకోవడానికి, తన రిటైర్మెంట్ ప్లాన్ ను వాయిదా వేయించుకోవడానికి ఆర్ఎస్ఎస్ ప్రస్తావన తీసుకొచ్చారని కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రత్యక్ష పాత్ర పోషించలేదని, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలు, నిరసనలకు దూరంగా ఉందని మాణిక్కం ఠాగూర్ గుర్తు చేశారు. హెడ్గేవార్ 1925కు ముందు కాంగ్రెస్ నిరసనలకు మద్దతు ఇచ్చారని, ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించిన తర్వాత, ఆయన దృష్టి సాంస్కృతిక జాతీయవాదంపైకి మారిందే తప్ప బ్రిటిషర్లను ఎదుర్కొనడంపై కాదని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగ పునాదులను ఆర్‌ఎస్‌ఎస్ బలహీనపరిచిందని విమర్శించారు.

1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత గోల్వాకర్ బహిరంగంగా స్వయం సేవలకు సూచించారని మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం బ్రిటీష్ వలసవాదాన్ని వ్యతిరేకించడం కాదని, తోటి భారతీయుల్లో ద్వేషాన్ని విభేదాలను వ్యాప్తి చేయడమేనని పేర్కొన్నారు. అదే మహాత్మా గాంధీని దూరం చేసిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+