వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడి సముద్రంలో నరేంద్ర మోడీ కీలక సమావేశం

|
Google Oneindia TeluguNews

కొచ్చి: కేరళ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అరేబియా సముద్ర జలాల్లో వినూత్న రీతిలో త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశం నిర్వహించారు. కొచ్చి తీరానికి 40 వాటికన్ మైళ్ల దూరంలో ఈ కీలక సమావేశం జరిగింది.

రెండు రోజులు కేరళ పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ లో కొచ్చి తీరానికి 40 వాటికన్ మైళ్ల దూరంలో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్దనౌక దగ్గరకు వెళ్లారు.

త్రివిధ దళాధిపతులు నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలికారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ కార్యక్రమానికి హాజరైనారు. మద్యాహ్నాం 1 గంట వరకు నరేంద్ర మోడీ, మనోహర్ పారికర్ త్రివిధ దళాధిపతులతో కీలక సమావేశం నిర్వహించారు.

PM Narendra Modi to chair commanders conference on board INS Vikramaditya

అనంతరం హెలికాప్టర్ లో నరేంద్ర మోడీ కొచ్చి బయలుదేరి వెళ్లారు. భారత నౌకాదళంలోని అతి భారీ యుద్దనౌక విక్రమాదిత్యను నరేంద్ర మోడీ రెండవ సారి సందర్శించారు. గత జూన్ నెలలో ప్రధాని నరేంద్ర మోడీ విక్రమాదిత్యను జాతికి అంకితం చేశారు.

మంగళవారం మద్యాహ్నాం కేరళలోని కొల్లాంలో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గోననున్నారు. అనంతరం సాయంత్రం నరేంద్ర మోడీ ఢిల్లీ బయలుదేరి వెలుతున్నారు. నడి సముద్రంలో నరేంద్ర మోడీ కీలక సమావేశం నిర్వహించి చరిత్ర సృష్టించారు.

English summary
Also known as the Unified Commanders’ Conference, the meet is crucial as it discusses in detail national defence policy and operational challenges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X