కర్ణాటకలో ప్రధాని, టిఫిన్ ఎవరు చేశారు, సూపర్, సిఎంకు మోడీ పరోక్షహెచ్చరిక !

బెంగళూరు: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రధాని నరేంద్ర మోడీ మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. అదే జోష్ లో 2018 కర్ణాటకలో జరిగే శాసన సభ ఎన్నికల మీద ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. అందుకూ పరోక్షంగా హెచ్చరికలు ఇస్తూ అదే రోజు అర్దరాత్రి ప్రధాని మోడీ కర్ణాటకలో అడుగు పెట్టారు.

అర్దాత్రి కర్ణాటకలో !

అర్దాత్రి కర్ణాటకలో !

సోమవారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో సంబరాలు జరుపుకున్న ప్రధాని నరేంద్ర మోడీ అదే రోజు అర్దరాత్రి కర్ణాటకలోని మంగళూరు చేరుకున్నారు. సోమవారం అర్దరాత్రి మంగళూరులోని బజ్పే విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

మోడీ ముందు క్యూ

మోడీ ముందు క్యూ

కేంద్ర మంత్రి పి. రాధాకృష్ణన్, దక్షిణ కన్నడ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ నళిన్ కుమార్, కర్ణాటక డీజీపీ నీలమణి రాజు, జిల్లాధికారి నసికాంత్ సెంథిల్, జిల్లా పంచాయితీ అధ్యక్షురాలు మీనాక్షి శాంతిగూడు, కస్తూరి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు.

 మోడీతో సంబరాలు

మోడీతో సంబరాలు

బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయం ముందు దాదాపు 10 వేల మంది బీజేపీ కార్యకర్తలు గుమికూడి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చిన మోడీ ముందు సంబరాలు జరుపుకున్నారు. మోడీ జిందాబాద్ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు.

3 గంటకే నిద్రలేచిన మోడీ

3 గంటకే నిద్రలేచిన మోడీ

సోమవారం అర్దాత్రి మంగళూరులో బస చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం వేకువ జామున 3 గంటలకే నిద్రలేచి యోగా చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ కర్ణాటక (సముద్ర తీర ప్రాంతాలు) వంటకాలు రుచిచూశారు.

సూపర్, ఎవరు చేశారు ?

సూపర్, ఎవరు చేశారు ?

మంగళవారం ఉదయం మంగళూరులోని ఓషియన్ పార్లే రెస్టారెంట్ లో తయారు చేయించిన ప్రత్యేక వంటకాలు ప్రధాని నరేంద్ర మోడీ ముందు పెట్టారు. దక్షిణ కర్ణాటకలో ప్రసిద్ది చెందిన నీరు దోసెను ఆరగించిన ప్రధాని చాలా బాగుందని మెచ్చుకున్నారు. తరువాత ఉప్మా, ప్రత్యేకంగా తయారు చేసిన అటుకులు, ముడి ఆరగించిన మోడీ చాల బాగున్నాయి, ఎవరు తయారు చేశారు అని ఆరా తీసి రెస్టారెంట్ లో వంట చేసిన సిబ్బంది అక్కడే ఉన్నారని తెలుసుకుని అభినందించి వారితో గ్రూప్ ఫోటో తీసుకున్నారు.

సీఎం సిద్దూకు మోడీ సంకేతాలు

సీఎం సిద్దూకు మోడీ సంకేతాలు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజే ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తన తరువాత మీరే టార్గెట్ అంటూ కర్ణాటకలో అడుగు పెట్టిన ప్రధాని మోడీ ఎన్నికలకు సిద్దంగా ఉండండి అంటూ సిద్దరామయ్య ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చారు.

వయా కర్ణాటక

లక్షద్వీప్ లో పర్యటించడానికి బయలుదేరిని ప్రధాని నరేంద్ర మోడీ మంగళూరులో చేరుకుని బస చెయ్యడం కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడ్డారు. మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీ మంగళూరు నుంచి లక్షద్వీప్ కు బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+