భారత్-ఆసీస్ మ్యాచ్‌పై 'మన్‌కీ బాత్'లో ప్రధాని
న్యూఢిల్లీ: దేశం పుట్‌బాల్ క్రికెట్‌లా అభివృద్ధి చేయాలని, పుట్‌బాల్ క్రీడలో భారత్ బాగా వెనుకబడిందని ఆదివారం జాతిని ఉద్దేశించి మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోడీ అన్న మాటలివి. ముఖ్యమంగా క్రీడల్లో సంస్కరణలు తీసుకొద్దామని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 2017లో అండర్-17 ఫిఫా పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
మన్‌కీ బాత్‌లో ప్రధాని మోడీ మాట్లాడటం ఇది పద్దెనిమిదోసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ వైవిధ్యంతో నిండిన దేశమని.. దీన్ని అన్వేషించడానికి జీవితకాలం సరిపోదని అన్నారు. విద్యార్థులు వేసవి సెలవులను కొత్త కొత్త స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామని, పర్యాటకంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు చాలా అవకాశాలున్నాయని అన్నారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని. ఇంట్లో, స్కూళ్లో, స్నేహితులతో నేర్చుకున్న దానికంటే పర్యాటకం మనకు ఎంతో నేర్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే, నీటి సంరక్షణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్షపాతం గణనీయంగా తగ్గిపోవడంతో భూగర్భజలాలు బాగా అడుగంటి పోతున్నాయని అన్నారు. అందువల్ల నీటిని పొదుపు చేయడానికి కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. నీరు రైతులకు చాలా ముఖ్యమని, కిసాన్ సువిధ యాప్‌ను రైతులు డౌన్‌లోడ్ చేసుకోవాలని అన్నారు.
డిజిటల్ ఇండియా నగరాల్లోని యువత కోసం మాత్రమే కాదని... రైతుల కోసం కూడా అని పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని యాప్ ద్వారా పొందాలన్నారు. క్రిస్టియన్ సోదరులకు ఈస్టర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చివరగా, మీరంతా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసన్నారు.
ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో ప్రతిభ కనబరుస్తున్న భారత జట్టును నరేంద్ర మోడీ అభినందించారు. ముఖ్యంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లపై భారత్ గెలవడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే, ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి సెమీస్‌కు చేరాలని ఆయన ఆకాంక్షిస్తూ ధోనీ సేనకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.
PM congratulates Indian cricket team for their wins against Pakistan & Bangladesh & conveys best wishes for the match today. #MannKiBaat
— PMO India (@PMOIndia) 27 March 2016
India had a good run in football earlier but that is not the case now. Our rankings are also very low: PM @narendramodi
— PMO India (@PMOIndia) 27 March 2016
Looking forward to meeting you all tomorrow. Do tune in. #MannKiBaat pic.twitter.com/XBzwad2bCt
— Narendra Modi (@narendramodi) 26 March 2016
I see that our youth is enjoying football like EPL. Its important to take football to every village & FIFA U-17 is a great opportunity: PM
— PMO India (@PMOIndia) 27 March 2016
PM @narendramodi emphasises on cleanliness at tourist spots across India. #MyCleanIndia https://t.co/Iy8hu3Nre5 #MannKiBaat
— PMO India (@PMOIndia) 27 March 2016
My young friends, don't let your holidays go just like that. Pick up one skill during the holidays: PM @narendramodi #MannKiBaat
— PMO India (@PMOIndia) 27 March 2016
This is a very important time for farmers. All of us have to think about one thing and that is water conservation: PM @narendramodi
— PMO India (@PMOIndia) 27 March 2016












Click it and Unblock the Notifications