PM Surya Ghar: ఈ పథకంతో మీ ఇంట వెలుగులే కాదు అదనపు ఆదాయం!

భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వారా దేశ ప్రజలకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. 300 యూనిట్ల వరకు దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ తీపి కబురు చెప్పారు. సౌర శక్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 15వ తేదీన బియ్యం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇళ్లల్లో సోలార్ ప్యానల్ అమర్చుకోవడానికి 40 శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది.

స్వయం విద్యుత్ కోసం సోలార్ సిస్టమ్
సౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మధ్యతరగతి మరియు పేద కుటుంబాలపై విద్యుత్ భారం పడకుండా ఖర్చును తగ్గిస్తుంది. వారి అవసరాలలో వారిని స్వయం విద్యుత్ ను వినియోగించుకునేలా ఉపయోగపడుతుంది.
రూఫ్ టాప్ సోలార్ సిస్టం భారత ప్రభుత్వం సోలార్ ప్యానల్ లకు సంబంధించి సబ్సిడీ కూడా ఇస్తుంది.

PM Surya Ghar scheme for not only solar electricity for home but also additional income

.కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌
లక్ష రూపాయలతో కూడుకున్న సోలార్ ప్యానల్ కు సంబంధించి 78 వేల రూపాయలవరకు ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. గతంలో ఈ పథకాలు నార్త్ లోనే ఎక్కువగా వినియోగించడం జరిగేది. ఇప్పుడు సౌత్ లో కూడా అన్ని గ్రామాలలో సౌర విద్యుత్ ను వాడుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది..కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల దేశం శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

300 యూనిట్ల ఉచిత విద్యుత్ .. ఆపై విద్యుత్ ఉత్పత్తికి ఆదాయం
ఇది దేశంలోని చాలా ప్రాంతాలలో సంవత్సరంలో 6-8 నెలల పాటు లభించే సూర్యరశ్మిని గరిష్టంగా ఉపయోగించుకుంటుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన సౌరశక్తితో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ పథకం కింద వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తే 18000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 75000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది.

ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే
ఈ పథకం కోసం బ్యాంకు నుండి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే కస్టమర్లకు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ పథకం కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు https://www.pmsuryaghar.gov.in/consumerLogin వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+