16 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్: ముగ్గురి అరెస్టు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై శివారులోని గోరేగావ్‌లో 16 మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. దీపావళి వేడుకలు జరుపుకుందామని పిలిచి అమ్మాయిపై నవంబర్ 1వ తేదీన సామూహిక అత్యాచారం జరిపారు.
అమ్మాయిపై ఆత్యాచారం చేసిన ఆరుగురిలో నలుగురు మైనర్లు కాగా, ఇద్దరు వయోజనులని భావిస్తున్నట్లు దిండోషి పోలీసులు చెప్పారు. మత్తు పదార్థం కలిపిన సాఫ్ట్ డ్రింక్ తనతో తాగించి స్పృహ తప్పిన తర్వాత తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది.

నిందితుల్లో ఇద్దరు అమ్మాయికి తెలిసినవారు. దీపావళి వేడుకలు జరిపిన తర్వాత తిరిగి ఇంటి వద్ద దిగబెడుతామని వారు అమ్మాయిని పిలిచారు. ఆ ఇద్దరు యువకులు మరో నలుగురిని పిలిచారు. వారంతా కలిసి అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశంలో సొరంగం చూసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఫొటో జర్నలిస్టుపై ముంబైలోని శక్తి మిల్స్‌లో సామూహిక అత్యాచారం జరిపిన మూడు నెలలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. చదువు ఆపేసిన 16 ఏళ్ల బాధితురాలు తన కుటుంబ సభ్యులతో ఉంటోంది.












Click it and Unblock the Notifications