భర్తకు బ్రెడ్ జామ్, ప్రియుడికి పాండ్స్ పౌండర్, అందుకే ముక్కలుగా నరికేశాడు

మహాలక్ష్మి అక్రమ సంబంధం కారణంగానే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి చంపినట్లు అతని సోదరుడికి హంతకుడు ఫోన్ చేసి చెప్పి తరువాత ఆమె బాయ్ ఫ్రెండ్ పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది.ఒడిశాకు చెందిన హంతకుడు వయ్యాలికావల్‌లో మహాలక్ష్మిని ఆమె ఇంటిలోనే దారుణంగా హత్య చేశాడని, తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసు అధికారులు అంటున్నారు.

సాంకేతిక సమాచారం ఆధారంగా బెంగళూరు నగరంలో ఉన్న నిందితుడి సోదరుడిని గుర్తించి అతన్ని పట్టుకుని విచారించామని సంబంధిత పోలీసు వర్గాలు ఓ కన్నడ దినపత్రికకు చెప్పాయి. హత్యకు గురైన మహాలక్ష్మి పనిచేస్తున్న మాల్‌లోనే నిందితుడు స్టోర్ మేనేజర్‌గా పనిచేశాడని సమాచారం. 9 నెలల క్రితం కుటుంబ కలహాలతో మహాలక్ష్మి భర్తను వదిలి బెంగళూరు నగరానికి వచ్చింది. ఆ సమయంలో మహాలక్ష్మి ఓ సేల్స్ షాపులో పనిచేస్తుండడంతో నిందితుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

Police have found her boyfriend in Bengaluru Mahalakshmi s murder case
రానురాను ఇద్దరి మధ్య స్నేహం అక్రమ సంబంధంగా దారితీసింది. ఇటీవల మహాలక్ష్మి, ఆమె ప్రియుడి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలిసింది. ఇటీవల మహాలక్ష్మి వేరొకరితో సన్నిహితంగా గడిపిందని, అతనితో అక్రమ సంబందం పెట్టుకుందని ఆమె మాజీ ప్రియుడికి తెలిసింది. ఈ విషయంపై కోపోద్రిక్తుడైన నిందితుడు మహాలక్ష్మిని చంపేయాలని అనుకున్నాడు. మహాలక్ష్మి, నిందితుల మధ్య మళ్లీ గొడవ జరిగింది.

అక్రమ సంబంధం వ్యవహారం వదిలేయాలని, నువ్వు నాతోనే ఉండాలని నిందితుడు మహాలక్ష్మిని హెచ్చరించాడు. తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి విషమించింది. ఆ తరువాత నిందితుడు మహాలక్ష్మిని దారుణంగా హత్య చేశాడని పోలీసు అధికారులు అన్నారు.
ప్రియురాలు మహాలక్ష్మిని దారుణంగా హతమార్చి నిందితుడు పారిపోవాలని ప్లాన్ చేశాడు. ఆ రోజు అర్దరాత్రి అతని సోదరుడికి ఫోన్ చేసి మహాలక్ష్మిని హత్య చేశాను అని చెప్పాడని పోలీసు అధికారులు తెలిపారు.

Police have found her boyfriend in Bengaluru Mahalakshmi s murder case

పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని, అందుకే బెంగుళూరు వదిలి వెళ్లిపోతున్నానని, నువ్వు కూడా బెంగళూరు వదిలి వెళ్లిపోవాలని, లేదంటే పోలీసులు నిన్ను పట్టుకుంటారని చెప్పాడని విచారణలో వెలుగు చూసిందని పోలీసు అధికారులు తెలిపారు. మహాలక్ష్మి హత్య కేసును పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. బెంగళూరు పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వస్తున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.

మృతురాలు మహాలక్ష్మి మొబైల్ ఫోన్ కాల్స్ (సీడీఆర్)ను పరిశీలించగా నిందితుడితో ఆమె పలుమార్లు సంభాషణలు జరిపినట్లు తేలింది. ఈ సీడీఆర్ ఆధారంగా మహాలక్ష్మితో సన్నిహితంగా ఉన్న వారిని పోలీసు అధికారులు గుర్తించారు. కానీ ముగ్గురిలో ఇద్దరు మాత్రమే పోలీసులకు దొరికారు. కానీ మరొకరు మాత్రం తప్పించుకున్నాడని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీసు అధికారి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+