కల్పితమేనా..? మర్కజ్ చీఫ్ వివాదాస్పద ఆడియో టేపు.. వెలుగులోకి సంచలన విషయాలు..

దేశంలో నిజాముద్దీన్ మర్కజ్ ఘటన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో మర్కజ్ లింకులు బయటపడటంతో ప్రభుత్వాలు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి ఓ వివాదాస్పద ఆడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నిజాముద్దీన్ మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ కంధల్వి.. కరోనా వైరస్ ముస్లింలను ఏమీ చేయలేదని,ఫిజికల్ డిస్టెన్స్ పాటించవద్దని తబ్లిఘీ జమాత్ సభ్యులకు సూచించినట్టు ఆ ఆడియోలో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే పోలీసుల విచారణలో ఇందుకు భిన్నమైన విషయాలు వెలుగుచూసినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.

ఆ ఆడియో క్లిప్ సృష్టించినదేనా..?

ఆ ఆడియో క్లిప్ సృష్టించినదేనా..?

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం..మౌలానా సాద్‌కి సంబంధించి బయటకొచ్చిన వివాదాస్పద ఆడియో టేపులు ఒరిజినల్ కాదని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఎఫ్ఐఆర్ నమోదైన ఆ ఆడియో క్లిప్.. పలు వేర్వేరు ఆడియో ఫైల్స్‌ను కలిపి సృష్టించినట్టుగా భావిస్తున్నారు. దీనిపై మరింత స్పష్టత కోసం ఆ వివాదాస్పద ఆడియో టేపుతో పాటు మిగిలిన ఆడియో టేపులను కూడా పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు.

పోలీసుల విచారణ ఇలా..

పోలీసుల విచారణ ఇలా..

మౌలానా వివాదాస్పద వ్యాఖ్యల ఆరోపణలపై కేసు నమోదు కావడంతో ఢిల్లీ పోలీసులు మర్కజ్‌లోని ఆయన ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం 350 ఆడియో క్లిప్స్‌ను గుర్తించారు. వాటన్నింటిని పరిశీలించాక.. అందులో మూడు ఆడియో క్లిప్స్ మర్కజ్ ఈవెంట్‌కు సంబంధించినవిగా తేల్చారు. ఇన్‌స్పెక్టర్ సతీశ్ కుమార్ నేత్రుత్వంలోని టీమ్.. వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేపు కోసం ల్యాప్‌టాప్‌లో వెతగ్గా.. అలాంటిదేదీ అందులో కనిపించలేదు. మరోవైపు విచారణలో సాద్ వ్యాఖ్యలు కల్పితమైనవిగా గుర్తించారు. సాద్ చేయని వ్యాఖ్యలను వేరే ఆడియో ఫైల్స్ నుంచి తీసుకొచ్చి అతికించినట్టుగా గుర్తించారు. దాదాపు అన్ని ఆడియో క్లిప్స్‌ను తాము మళ్లీ మళ్లీ విన్నామని.. వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడా లేవని పోలీసులు సీనియర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మరింత స్పష్టత కోసం ఆడియో క్లిప్స్ అన్నింటినీ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.

మార్చి 21న ఎఫ్ఐఆర్ నమోదు..

మార్చి 21న ఎఫ్ఐఆర్ నమోదు..

మార్చి 21వ తేదీన మౌలానా సాద్ పేరుతో వాట్సాప్‌లో ఓ వివాదాస్పద వీడియో వెలుగుచూసింది. లాక్ డౌన్ నిబంధనలను ధిక్కరించాలని మౌలానా అందులో పేర్కొన్నారు. ఇది దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే విచారణలో బయటపడుతున్న వాస్తవాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+