హంతకుడే సంతాపం తెలిపినట్లు..దోపిడీ గురించి హరీష్ రావ్ చెప్పాలి!

తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు, రాహుల్ గాంధీకి రాసిన లేఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని పేర్కొనడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి ఘాటుగా బదులిచ్చారు. హరీష్ రావు ని టార్గెట్ చేశారు.

హరీష్ రావుకు పొంగులేటి ఘాటు కౌంటర్

తెలంగాణలో సెక్షన్ 22ఏ నిషేధిత భూముల వివాదం పైన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు, రాహుల్ గాంధీకి రాసిన లేఖకు స్పందిస్తూ మంత్రి పొంగులేటి ఎక్స్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అబద్ధాలు చెబుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని మండిపడ్డారు.

ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!
ఆ మంత్రిని తప్పించండి, ఇదిగో ఆధారాలు - రాహుల్ గాంధీకి హరీష్ లేఖ..!!
Ponguleti Srinivas Reddy Counters Harish Rao on Telangana 22A Prohibited Lands Row challenged harish rao

అవినీతి, కమీషన్ల గురించి మీరే మాట్లాడాలి

అవినీతి, కమీషన్ల గురించి హరీశ్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, హంతకుడే సంతాపం తెలిపినట్లు ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్వయంగా వెల్లడించిన విషయాలను గుర్తు చేశారు. హరీష్ రావు చేసిన అవినీతి పైన కవితే స్వయంగా అనేక విషయాలు మాట్లాడారని గుర్తు చేశారు.

కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు మీ దోపిడీ తెలియదా

బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న సమయంలో హరీష్ రావు ఎలా సంపాదించారో, ఏం వ్యాపారం చేశారో, తక్కువ సమయంలో బాగా ఆర్థికంగా ఎదగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించాలని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. అగ్గిపెట్టె రావు అని సెటైర్లు వేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, ధరణి నుంచి మెడికల్ కాలేజీల వరకు అన్నింటిలోనూ దోచుకున్న వారు ఇప్పుడు కమీషన్ల ప్రభుత్వమని మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఆ తేదీల్లో శివమొగ్గకు క్షుద్రపూజల కోసమే వెళ్ళిన హరీష్ రావు.. కాదని నిరూపించు!
ఆ తేదీల్లో శివమొగ్గకు క్షుద్రపూజల కోసమే వెళ్ళిన హరీష్ రావు.. కాదని నిరూపించు!

ఆ సంపాదన రహస్యం ప్రజలకు చెప్పు హరీష్

తమ ఆర్థిక పరిపుష్టికి అవినీతే ఆధారమని, అంత తక్కువ కాలంలో ఎలా సంపాదించారో రహస్యం ప్రజలకు చెప్పాలని సవాలు విసిరారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లకు, దోచుకు తిన్న వాళ్లకు మాత్రమే దోపిడీ గురించి తెలుస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారుల తప్పిదాలను అంగీకరించి సరిదిద్దుతోందని, 22a నిషేధిత భూముల విషయంలో నిజమైన యజమానులకు ఉపశమనం కల్పిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

కమిషన్లు, అవినీతి గురించి హరీష్ రావు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు నవ్వుతున్నారు

గత ప్రభుత్వ హయాంలో కమిషన్ల పాలన జరిగిందని, ఈ ప్రభుత్వ హయాంలో కూడా అలాగే జరుగుతుంది అనుకోవడం మీ భ్రమ అంటూ పేర్కొన్నారు. మీ భ్రమలను ప్రజల పైన రుద్దకండి అంటూ హితవు పలికారు. కమిషన్లు, అవినీతి గురించి హరీష్ రావు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారని మంత్రి పొంగులేటి అన్నారు.ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
q