శశికళకు ఝలక్: జయలలిత పోయెస్ గార్డెన్ వద్ద భద్రత కుదింపు
దివంగత జయలలిత నివాసానికి సోమవారం భద్రతను కుదించారు. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు.
చెన్నై: దివంగత జయలలిత నివాసానికి సోమవారం భద్రతను కుదించారు. ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం నలుగురు పోలీసులను ఉంచారు. ప్రయివేటు భద్రతా సిబ్బంది అక్కడ బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
సెక్యూరిటీని తగ్గించిన వెంటనే ఆ ప్రాంతంలో బారీకేడ్‌లను, చెక్ పాయింట్లను తొలగించారు. జయలలిత ఉన్నప్పుడు అక్కడ నిత్యం చెక్ చేసేవారు. సోమవారం నుంచి అది కనిపంచలేదు. కాగా, ప్రస్తుతం పోయెస్ గార్డెన్‌లో శశికళ ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం సాయంత్రం పోయెస్ గార్డెన్ వెళ్లి శశికళతో పావుగంట భేటీ అయ్యారు. ఈ నెల 29వ తేదీన శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల న్యూఢిల్లీ పర్యటన, పోయెస్ గార్డెన్ వద్ద భద్రత కుదింపు, 29న పార్టీ సమావేశం తదితర అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

29న జయలలితను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటారా? లేక శాసన సభా పక్ష నాయకురాలిగా ఎన్నకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే ఆమె ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తారు. పార్టీ చీఫ్ పదవిని పెండింగులో ఉంచవచ్చని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications