కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్-చిదంబరం తొలిఓటు, సోనియా, రాహుల్, ప్రియాంక కూడా..
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల ఓటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంతో పాటు పీసీసీ కార్యాలయాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేత చిదంబరం తొలి ఓటు వేశారు. అనంతరం తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంల ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాహుల్ గాంధీ కర్నాటకలో భారత్ జోడో యాత్ర క్యాంపు నుంచే ఓటు వేశారు.
#WATCH | "I have been waiting for a long time for this thing," says Congress interim president Sonia Gandhi on the party's presidential election pic.twitter.com/9giL5DeOEX
— ANI (@ANI) October 17, 2022
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ముందున్న మల్లిఖార్జున ఖర్గే బెంగళూరులో తన ఓటు వేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా తాము మిత్రులుగా ఉందామని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో అభ్యర్ది శశిథరూర్.. మల్లిఖార్జున ఖర్గేతో పోలింగ్ ప్రారంభానికి ముందే వ్యాఖ్యానించారు. అనంతరం శశిథరూర్ కు ఖర్గే కూడా తన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ గాంధీతో పాటే భారత్ జోడో యాత్రలో ఉన్న సీనియర్ నేత జైరాం రమేష్ కూడా అక్కడే క్యాంపులో ఓటువేశారు.అనంతరం భారత రాజకీయాల్లో ఇదే చారిత్రక దినంగా అభివర్ణించారు.

ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీకి చెందిన 9 వేల మంది ప్రతినిధులు ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోని పీసీసీ కార్యాలయాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల రేసులో ముందున్న మల్లిఖార్జున ఖర్గేవైపు దాదాపుగా నేతలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరో అభ్యర్ధి శశిథరూర్ కూడా ఈ ఎన్నికలను స్పోర్టివ్ గా తీసుకుంటుండంతో ఆహ్లాదకరవాతావరణంలో ఎన్నికలు సాగుతున్నాయి.
-
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications