Porn videos: శిల్పా శెట్టి అనూహ్యం -మీడియా, సోషల్ మీడియాపై పరువునష్టం దావా -హైకోర్టు రియాక్షన్
బాలీవుడ్ ను కుదిపేస్తోన్న పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న రాజ్ కుంద్రా సతీమణి, ప్రఖ్యాత నటి శిల్పా శెట్టి అనూహ్య చర్యకు పూనుకున్నారు. ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తోన్న పోర్న్ వీడియోల కేసుకు సంబంధించి తనపై వస్తోన్న అనుచిత వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చపై శిల్పా న్యాయపోరాటానికి దిగారు. బాంబే హైకోర్టులో ఈ మేరకు పరువునష్టం దావా వేశారామె..
వివిధ భాషలకు చెందిన 29 మీడియా సంస్థలు, సీనియర్, జూనియర్ జర్నలిస్ట్‌లు, ఫేస్ బుక్, ట్విటర్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా సంస్ధలపైనా బాలీవుడ్ నటి శిల్పా షెట్టి పరువు నష్టం కేసు వేశారు. ఆమె తరఫు లాయర్లు గురువారం వేసిన పిటిషన్ పై బాంబే హైకోర్టు స్పందించింది. ఈ కేసు శుక్రవారమే విచారణకు రానుంది.

వీడియో రాకెట్ కు సంబంధించిన ఘటనలకు ముడిపెడుతూ, తన భర్త రాజ్‌కుంద్రతో పాటు తమ కుటుంబానికి పరువునష్టం కలిగే విధంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని, సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు వస్తున్నాయని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్‌లో శిల్పా శెట్టి పేర్కొన్నారు. ఇకపై తన పరువుకు భంగం కలిగించే వార్తలు రాకుండా మీడియాలను కట్టడి చేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని కోర్టును ఆమె అభ్యర్థించారు. కాగా,
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఆధ్వర్యంలో నడిచిందని పోలీసులు చెబుతోన్న పోర్న్ వీడియోల కేసులో నటి షెర్లీన్ చోప్రాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. తనను కూడా అరెస్టు చేస్తారనే భయంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా, కోర్టు నిరాకరించింది. పోర్న్ వీడియోల ద్వారా రాజ్ కుంద్రా రోజుకు రూ.10 లక్షల వరకూ సంపాదించేవారని రిపోర్టులు వచ్చాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications