Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విద్యుత్ సంక్షోభంపై కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు: భారత్ లో 70% విద్యుత్ బొగ్గు నుండే, ఎవరి వాదన వారిదే!!

దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత ఉందని, దీంతో విద్యుత్ కష్టాలు మొదలు కానున్నాయని, కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. కానీ కేంద్రం మాత్రం ఆల్ ఈజ్ వెల్ అంటూ అంతా బాగానే ఉంది అంటూ బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై రాష్ట్రాలది అనవసరపు ఆందోళన అంటూ కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాసి విద్యుత్ సంక్షోభం పై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తే మన దగ్గర కావలసినంత పవర్ ఉందంటూ, ఎవరికి కావాలో చెప్పండి సప్లై చేస్తామంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు విద్యుత్ సంక్షోభంపై కేంద్రం వర్సెస్ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Recommended Video

    Power Crisis : బొగ్గు కొరత వల్లే విద్యుత్ సంక్షోభం.. 70% విద్యుత్ బొగ్గు నుండే..! || Oneindia Telugu

     భారత్ లో 70% విద్యుత్ బొగ్గు నుండే.. బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం

    భారత్ లో 70% విద్యుత్ బొగ్గు నుండే.. బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం

    భారతదేశం తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నదని, బొగ్గు కొరత కారణంగా డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ను తయారు చేయలేక పోతున్నారని తెలుస్తుంది. భారతదేశంలో 70 శాతం విద్యుత్తును బొగ్గు నుంచి తయారు చేస్తున్నారని అంతర్జాతీయంగా బొగ్గు ధరలు 40 శాతం పెరగడంతో దిగుమతులు లేక రెండు ఏళ్ల కనిష్టానికి బొగ్గు నిల్వలు పడిపోయాయని చెప్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మాత్రం విద్యుత్ సంక్షోభం లేదని, మూడు నాలుగు రోజుల్లో సమస్య సద్దుమణుగుతుందని చెప్పడం రాష్ట్రాలకు ఆగ్రహం తెప్పిస్తుంది.

     కేంద్రంపై కేజ్రీ సర్కార్ యుద్ధం

    కేంద్రంపై కేజ్రీ సర్కార్ యుద్ధం

    ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విద్యుత్ మంత్రి ఆర్‌కె సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. దేశంలో తగినంత బొగ్గు స్టాక్ ఉందన్న స్టేట్మెంట్ ను బాధ్యతారహితమైన స్టేట్మెంట్ అని అయన వ్యాఖ్యానించారు. కోవిడ్ -19 రెండవ వేవ్ సమయంలో రాజధానిలో ఆక్సిజన్ కొరత సంక్షోభం సమయంలో అదే విషయం చెప్పారని మాకు ఆక్సిజన్ సంక్షోభం ఉన్నప్పుడు, అలాంటి సంక్షోభం లేదని వారు చెబుతూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. బొగ్గు పరిస్థితి కూడా అదేవిధంగా ఉందని కేంద్రం బొగ్గు స్టాక్ ఉంది, విద్యుత్ సంక్షోభం లేదు అన్న వ్యాఖ్యలను ఖండించారు. ఒక పక్క కేంద్రం సరిపడా విద్యుత్ ఉందని చెబుతుంటే, ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కారు మాత్రం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. కేంద్రం సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది అన్న భావనను వ్యక్తం చేస్తుంది..

     గెయిల్, టాటా సంస్థలకు తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?

    గెయిల్, టాటా సంస్థలకు తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏముంది?

    బొగ్గు కొరత గురించి అనవసరంగా భయాందోళనలు సృష్టించబడ్డాయని, గెయిల్ మరియు టాటా నుండి తప్పుడు సమాచారమే దీనికి కారణమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలకు వివిధ రాష్ట్రాలు ప్రశ్నలు సంధిస్తున్నారు. గెయిల్, టాటా విద్యుత్ సంస్థలకు తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు దేశంలో విద్యుత్ సంక్షోభం లేకుంటే, ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే కేంద్రం అంతా బానే ఉందని చెప్పటం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

    ఏపీలోనూ బొగ్గు కొరత .. విద్యుత్ సంక్షోభం .. మోడీకి లేఖ రాసిన జగన్

    ఏపీలోనూ బొగ్గు కొరత .. విద్యుత్ సంక్షోభం .. మోడీకి లేఖ రాసిన జగన్

    ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొగ్గు కొరత సమస్యను, విద్యుత్ సంక్షోభాన్ని గురించి ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో ఏపీ జెన్కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 45 శాతం మేరకు మాత్రమే తీర్చ కలుగుతోందని బొగ్గు కొరత వల్ల ఏపీలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతో పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ ధర్మల్ ప్రాజెక్టులకు బొగ్గును కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరా మెరుగుపడకపోతే ప్రజలు అంధకారంలో ఉండాల్సి వస్తుంది అంటూ పేర్కొన్నారు.

    ఇప్పటికే బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ లో ప్రజలు రోజుకు 14 గంటల విద్యుత్ కోతలు

    ఇప్పటికే బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ లో ప్రజలు రోజుకు 14 గంటల విద్యుత్ కోతలు

    మరోపక్క బొగ్గు సరఫరా సంక్షోభం వల్ల బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ లో ప్రజలు రోజుకు 14 గంటల వరకు విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నారని సమాచారం. అయితే విద్యుత్ సంక్షోభంపై కేంద్ర మంత్రులు చెబుతున్న విషయాలు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర ప్రకటనలు రాష్ట్రాలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని, దేశం మొత్తానికి విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎవరికైతే విద్యుత్ కొరత ఉంటుందో వారు తమకు అభ్యర్థన పంపాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

     బొగ్గు కొరత ఉంది కానీ డిమాండ్ కు తగ్గ నిల్వలు ఉన్నాయన్న బొగ్గు శాఖా మంత్రి

    బొగ్గు కొరత ఉంది కానీ డిమాండ్ కు తగ్గ నిల్వలు ఉన్నాయన్న బొగ్గు శాఖా మంత్రి

    బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దేశంలో బొగ్గు అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా, భారీ వర్షపాతం కారణంగా కొరత ఏర్పడిందని వెల్లడించారు. మూడు నాలుగు రోజుల్లో సమస్య సర్దుకుంటుందని పేర్కొన్నారు. అయినప్పటికీ విద్యుత్ ప్లాంట్ల డిమాండ్ కు అనుగుణంగా దేశంలో బొగ్గు అందుబాటులో ఉందని చెప్పడం గమనార్హం. బొగ్గు కొరత వాస్తవం అయినప్పుడు, విద్యుత్ సంక్షోభం లేకుండా ఎలా ఉంటుందని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. సరిపడా విద్యుత్ లేకనే విద్యుత్ కోతలు విధిస్తున్నట్లుగా వాపోతున్నాయి. కేంద్రం చెప్పినట్టు రాష్ట్రాలకు సరిపడా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.

    కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న బీజేపీయేతర రాష్ట్రాలు

    కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న బీజేపీయేతర రాష్ట్రాలు

    ఇదిలా ఉంటే ప్రస్తుతం 72 లక్షల టన్నుల బొగ్గు స్టాక్ ఉందని నాలుగు రోజుల అవసరానికి మాత్రమే సరిపోతుందని కోల్ ఇండియా ప్రకటన చేయడంతో ఆందోళన నెలకొంది. విద్యుత్ సంస్థలు దేశంలో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశముందని, జాగ్రత్తగా విద్యుత్ ను వినియోగించుకోవాలని వివిధ రాష్ట్రాలకు సందేశాలు పంపడంతో రగడ మొదలైంది. కేంద్రం ఆల్ ఈజ్ వెల్ అంటుంటే రాష్ట్రాలు మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+