ఫామ్ హౌస్ రాసలీలలు: జీవితాంతం జైలులో మగ్గాల్సిందే
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపిన భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనతాదళ్ (సెక్యులర్) చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్న కొడుకు, లోక్‌సభ మాజీ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు శిక్షను ఖరారు చేసింది. ఆయన తండ్రి, మాజీ మంత్రి రేవణ్ణకూ 11 లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది. అయిదు లక్షల రూపాయల జరిమానా విధించింది. మరో ఏడు లక్షల రూపాయలను అత్యాచార బాధితురాలికి చెల్లించాలని ఆదేశించింది.
ఫామ్ హౌస్ లో ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. మొత్తం నాలుగు కేసులు ఆయనపై ఫైల్ చేశారు పోలీసులు. ఈ నాలుగింట్లో ఒక్క కేసులోనే తాజా తీర్పు వెలువడింది. అత్యాచార బాధితురాలి స్వస్థలం మైసూరు. కేఆర్ నగరలో నివాసం ఉంటోన్నారు.
గత ఏడాది ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ స్కాండల్ వీడియో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తన ఫామ్ హౌస్ లో అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అప్పట్లో. లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ ఉదంతం వెలుగులోకి రావడం.. అటు రాజకీయంగా కలకలం రేపింది.
ఈ వీడియో బయటికి వచ్చిన వెంటనే ప్రజ్వల్ దేశం విడిచారు. జర్మనీకి వెళ్లిపోయారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశలో అంటే ఏప్రిల్ 26వ తేదీన పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ప్రజ్వల్ రేవణ్ణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వెంటనే ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు.
ఆయనను స్వదేశానికి రప్పించడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బ్లూ కార్నర్ నోటీస్ సైతం ప్రజ్వల్‌పై జారీ అయింది అప్పట్లో. ఇదే కేసులో ఆయన తండ్రి, మాజీ మంత్రి రేవణ్ణ సైతం అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.
జర్మనీ నుంచి ప్రజ్వల్‌ను స్వదేశానికి రప్పించడానికి కర్ణాటక ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు సాగించింది. ఆయనకు కేటాయించిన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. చట్టపరంగా విచారణను ఎదుర్కొనక తప్పదంటూ కుమారస్వామి సైతం చెప్పుకొచ్చారు.
జర్మనీ నుంచి వచ్చిన తరువాత లొంగిపోయారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొన్నారు. వాదోపవాదాలన్నింటినీ శుక్రవారమే ముగించింది న్యాయస్థానం. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా నిర్ధారించింది. ఆయన తండ్రికి కూడా జరిమానా విధించింది.












Click it and Unblock the Notifications