దీదీ దూకుడు వెనుక ప్రశాంత్ కిషోర్ మేధస్సు... జాతీయ రాజకీయాల్లో టీఎంసి ఎంట్రీకి గోవా ఎన్నికలే కీలకం

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి మమతాబెనర్జీ సన్నద్ధమవుతున్నారా? మమతా బెనర్జీ దూకుడుకు, ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు ఊతంగా మారుతున్నాయా? దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారా? గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ ఆశించిన ఫలితాలు వస్తే మిగతా రాష్ట్రాలలోనూ పార్టీని విస్తరించాలని మమతా బెనర్జీ భావిస్తున్నారా?అంటే అవును అన్న సమాధానమే వస్తుంది

 టీఎంసీ జాతీయ రాజకీయాలకు లాంచింగ్ ప్యాడ్ గా గోవాలో ఎన్నికలు

టీఎంసీ జాతీయ రాజకీయాలకు లాంచింగ్ ప్యాడ్ గా గోవాలో ఎన్నికలు

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గోవా అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గోవా ఎన్నికల ఫలితాలలో బీజేపీని చావు దెబ్బ కొట్టాలని ఆమె కంకణం కట్టుకున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాని అంచనాలు నిజమైతే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దానిని జాతీయ రాజకీయాల్లో లాంచింగ్ ప్యాడ్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పార్టీని విస్తృతం చేయడాన్ని వేగవంతం చేస్తూ, బిజెపికి వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రతిపక్షంగా ఎదగడానికి సన్నాహాలు చేసే అవకాశం ఉంది.

ఉత్తర, దక్షిణ భారత దేశంలో పార్టీ విస్తరించే పనిలో మమతా బెనర్జీ

ఉత్తర, దక్షిణ భారత దేశంలో పార్టీ విస్తరించే పనిలో మమతా బెనర్జీ

మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రముఖ రాష్ట్రాలలో కూడా పార్టీని విస్తరించాలని యోచిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ మరియు లౌకిక దృక్పథాలు, చర్యలతో జాతీయ పార్టీగా మార్చడానికి దాని వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఉంది అని టీఎంసి నాయకులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ తన రెక్కలను విస్తరించడానికి ఇప్పటికే పని ప్రారంభించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నట్లు సమాచారం. ఇటీవల గోవాలో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరుతున్న పరిస్థితులపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది.

టీఎంసిలో కీలక నేతల చేరికల వెనుక పీకే మైండ్

టీఎంసిలో కీలక నేతల చేరికల వెనుక పీకే మైండ్

టీఎంసీ చేరికల వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని పేర్కొన్నారు. గోవాలో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి, ఆపై జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఎదగాలని భావిస్తోందని తాజాగా మమతా బెనర్జీ వేస్తున్న అడుగులను బట్టి అర్థమవుతుంది. అందులో భాగంగానే మాజీ సీఎం లుజిన్హో ఫులేరో, టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్, నటుడు నఫీసా అలీ మరియు మిరినాలినీ దేశ్‌ప్రభుతో సహా అనేక మంది ప్రభావవంతమైన వారిని పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తుంది.

కర్ణాటక కాంగ్రెస్ నాయకులపై టీఎంసి ఫోకస్ .. పార్టీలో చేర్చుకునే ఎత్తుగడ

కర్ణాటక కాంగ్రెస్ నాయకులపై టీఎంసి ఫోకస్ .. పార్టీలో చేర్చుకునే ఎత్తుగడ


దక్షిణ భారతదేశంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విస్తరణలో భాగంగా మొదట దృష్టి కర్ణాటకపై ఉందని మరియు కొంతమంది కాంగ్రెస్ నాయకులను చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి . రాష్ట్రంలో 2023లో జరగనున్న తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో టీఎంసీని తీసుకెళ్లే యోచన కూడా ఉందని సమాచారం. కాబట్టి, పార్టీ ప్రభావవంతమైన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Recommended Video

    Telangana : జాతీయ రాజకీయాల్లో CM KCR అడుగులు.. Mamata Banerjee తో భేటీ! || Oneindia Telugu
    గోవా ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి టీఎంసి ప్లాన్

    గోవా ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి టీఎంసి ప్లాన్

    2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న మమతాబెనర్జీ పార్టీ ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక మమతా బెనర్జీ ఆలోచనకు, ప్రశాంత్ కిషోర్ మేధస్సు కూడా జోడి కావడంతో దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి గోవా ఎన్నికలను వేదికగా చేసుకుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల ఫలితాలను బట్టే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం, మమతా బెనర్జీ భవిష్యత్తు ప్రణాళిక ఏవిధంగా ఉండబోతుందో తెలియనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+