ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ మార్క్ షాకులు- పార్టీలో చేరకుండానే- అహ్మద్ పటేల్ తో పోలిక-నో ఛాన్స్
దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు తన వ్యూహాల కోసం ఎదురుచూస్తుంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతన్నారు. దీంతో శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయనో చిన్నా చితకా నాయకుడిలా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు పీకే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో పార్టీలో ఆయనకు ఎలాంటి పాత్ర ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి అందుతున్న లీకులు ఆయనకు భారీ షాకిచ్చేలా ఉన్నాయి.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
2014లో ప్రధానిగా నరేంద్రమోడీని ప్రమోట్ చేసే క్రమంలో తెరపైకి వచ్చిన పేరు ప్రశాంత్ కిషోర్. దేశవ్యాప్తంగా బీజేపీ ర్యాలీలు ఏర్పాటు చేయించడంతో పాటు మోడీ ఎన్నికల వ్యూహాల్లో కీలకంగా వ్యవహరించిన పీకే పేరు ఒక్కసారిగా మార్మోగడం మొదలైంది. ఆ తర్వాత యూపీ, బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పీకే వ్యూహాలు పనిచేయకపోయినా ఏపీలో జగన్, బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ను గెలిపించడం ద్వారా తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత పీకే ఏం చేయబోతున్నారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం.

కాంగ్రెస్ వైపు పీకే చూపు
దేశవ్యాప్తంగా గతంలో బీజేపీ వంటి జాతీయ పార్టీని, వైసీపీ, డీఎంకే, టీఎంసీ వంటి ప్రాంతీయ పార్టీల్ని గెలిపించినా ప్రశాంత్ కిషోర్ కు మాత్రం ఓ తీరని కోరిక మిగిలిపోయింది. ఇప్పటివరకూ గెలిచే పార్టీలకు ఊతమిచ్చిన ప్రశాంత్ కిషోర్ ఓడిపోయే పార్టీల్ని పట్టించుకోరనే అపప్రద ఉంది. దీన్ని చెరిపేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని పీకే నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పవార్, మమత వంటి నేతల్ని ఒప్పించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ తో నేరుగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పార్టీలో చేరిపోతేనే మంచిదని ఆయన భావిస్తున్నారు.

పీకే ఎంట్రీపై సానుకూలంగానే కాంగ్రెస్
దేశవ్యాప్తంగా ఎన్నో రాజకీయ పార్టీలకు హాట్ కేక్ గా మారిపోయిన ప్రశాంత్ కిషోర్ ను తమ దొడ్లో కట్టేసుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకు పీకే కూడా సానుకూలంగానే ఉన్నారు. దీంతో ప్రశాంత్ కిషోర్ ను అదను చూసి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఆయన పోషించిన రాజకీయ వ్యూహకర్త పాత్రను, ఆయన అనుభవాన్ని తమకోసం వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో పీకే చేరిక కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం బీజేపీ అన్నా, అమిత్ షా అన్నా అంతెత్తున్న లేస్తున్న పీకే కాంగ్రెస్ లో చేరి ఏం చేయబోతున్నారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అహ్మద్ పటేల్ స్ధానం కోరుతున్న పీకే ?
కాంగ్రెస్ పార్టీలో తాను చేరితే గతంలో అధినేత్రి సోనియాగాంధీకి రాజకీయ కార్యదర్శిగా, పార్టీ వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్ గా దివంగత నేత అహ్మద్ పటేల్ పోషించిన పాత్ర తనకు ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ కోరుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్తగా తనకు ఉన్న అనుభవంతో పాటు వివిధ పార్టీలతో ఉన్న తన సంబంధాలు కూడా ఇందుకు ఉపయోగపడతాయని పీకే భావిస్తున్నారు. దీంతో తనకు అహ్మద్ పటేల్ తరహాలో అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ లో వెంటనే చేరేందుకు సిద్ధమని ఆయన ప్రతిపాదనలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పీకేకు ఆ హోదా కష్టమేనా ?
కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరతారా లేదా అన్న దానికంటే చేరితే ఆయనకు రాజకీయ వ్యూహకర్త హోదా లభిస్తుందా లేదా అన్న దానిపై ఇప్పుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. దీనిపై కాంగ్రెస్ నేతల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో మెజారిటీ వర్గం మాత్రం కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ వ్యూహకర్త హోదా లభించకపోవచ్చని చెప్తున్నారు. గతంలో అహ్మద్ పటేల్ వంటి నేతలు పోషించిన వ్యూహకర్త పాత్రను అధినేత్రి సోనియాగాంధీ కొత్తగా వచ్చే ప్రశాంత్ కిషోర్ కు అప్పగించకపోవచ్చని వారు చెప్తున్నారు. దీంతో కేవలం ఏఐసీసీ సభ్యుడిగానో, మరో రకంగానో అవకాశం ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి ప్రశాంత్ కిషోర్ అంగీకరిస్తారా లేదా అన్నది కూడా ఇంకా తేలాల్సి ఉంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications