Prashant Kishor: ఒక్కో ఎన్నికల్లో అన్ని కోట్లు తీసుకుంటా.. ప్రశాంత్ కిషోర్..!
గతంలో ఏపీ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తర్వాత ఆ పని వదిలేసి బీహార్ లో జన్ సురాజ్ ఉద్యమం ప్రారంభించారు.
ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చి రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చినందుకు వారి నుంచి ఎంత తీసుకునే వారో వెల్లడించారు.

గతంలో తాను వ్యూహకర్తగా వ్యవహరించిన రాజకీయ పార్టీల నుంచి ప్రతీ ఎన్నికకు రూ.100 కోట్లకు పైగా ఫీజు వసూలు చేసినట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. బీహార్ లోని బెలాగంజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పీకే మాట్లాడారు. తన ప్రచారాలకు ఎలా నిధులు సమకూర్చుకుంటారో ప్రజలు తనను తరచుగా అడుగుతారని ఆయన తెలిపారు.వివిధ రాష్ట్రాల్లోని పది ప్రభుత్వాలు తన వ్యూహాలతో నడుస్తున్నాయని పీకే గుర్తుచేశారు.
తన ప్రచారానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని కొందరు అడుగుతున్నారని, తాను అంత బలహీనంగా లేనని, తాను ఓ ఎన్నికల్లో సలహా ఇస్తే 100 కోట్లకు పైగా వస్తాయని పీకే వెల్లడించారు. బీహార్‌లో త్వరలో జరిగే నాలుగు ఉప ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ తరఫున ఆయన అభ్యర్ధుల్ని నిలబెట్టారు. నవంబర్ 13న ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న ప్రకటిస్తారు. ఈ నాలుగు స్థానాల్లో బెలగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీ ఉన్నాయి. వీటిలో ప్రశాంత్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications