దళపతి విజయ్ కి షాక్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్..!
స్టార్ హీరో దళపత్తి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీ స్థాపించి.. ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన టీవీకే రెండవ వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రశాంత్ కిశోర్, విజయ్ నాయకత్వంలోని పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తమిళనాడులో రాజకీయ మార్పు తేవడమే లక్ష్యంగా టీవీకే పని చేస్తోందని, అందుకు తన వ్యూహాత్మక మార్గదర్శకత ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
పార్టీ ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తూ, టీవీకేను రాష్ట్రంలో ప్రధాన శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కానీ అనూహ్యంగా పార్టీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ (పీకే) ప్రస్తుతం తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు. ఇది టీవీకే రాజకీయ వ్యూహాలపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం బీహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రశాంత్ కిశోర్ తన సొంత రాష్ట్రంలోని 'జన్ స్వరాజ్ పార్టీ' అభ్యర్థులను బరిలోకి దించేందుకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో తమిళనాడులో టీవీకే ఎన్నికల వ్యూహాలపై సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా ఆయన తాత్కాలికంగా టీవీకే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నవంబర్ నాటికి పీకే తిరిగి బాధ్యతలు చేపడతారని అంచనాలు ఉన్నాయి. 2026లో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రణాళికలు రూపొందించనున్నారని చెబుతున్నారు.
మరోవైపు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల్ని నియమిస్తూ, ప్రజలలో మార్పు తేవాలన్న ఆశయంతో ముందుకు సాగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎవరితో పెట్టుకోమని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications