డిప్యూటీ సీఎం ఓటమి కోసం సర్వశక్తులొడ్డుతున్న ప్రశాంత్ కిషోర్..?

రాజకీయ వ్యూహకర్తగా పేరున్న జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గతంలో ఎన్నో పార్టీల్ని వారి స్వరాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తనదైన శైలిలో వ్యూహరచన చేశారు. వాటిలో ఎక్కువశాతం సక్సెస్ అయ్యారు కూడా. కానీ ఇప్పుడు ఆయనకు ఓ అసలైన సవాల్ ఎదురవుతోంది. తనను టార్గెట్ చేస్తున్న ఓ డిప్యూటీ సీఎంను ఎలాగైనా ఓడించి తీరాలన్న పట్టుదలతో పీకే ముందుకు కదులుతున్నారు. తద్వారా ఆయన సత్తాను మరోసారి పరీక్షించుకుంటున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన ఎన్డీయే, మహాకూటములకు ప్రత్యామ్నాయంగా మారేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కూ, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికీ మధ్య ఎప్పటి నుంచో మాటల యుద్దం సాగుతోంది. సెవెన్త్ క్లాస్ కూడా పాస్ కాని సామ్రాట్ ను డిప్యూటీ సీఎంగా బీజేపీ నామినేట్ చేయడం, ఆయన తనను టార్గెట్ చేస్తుండటంపై ఆగ్రహంగా ఉన్న పీకే ఇప్పుడు ఎన్నికల వేళ వ్యూహం మార్చారు.

santosh kumar singh tarapur

ఇప్పటివరకూ సామ్రాట్ చౌదరిపై మాటల యుద్ధం మాత్రమే చేసిన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఆయన్ను లాగైనా ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం తన జన్ సురాజ్ పార్టీ అభ్యర్ధితో పాటు కీలక నేతల్ని సామ్రాట్ పోటీ చేస్తున్న తారాపూర్ కు పంపారు. ముంగేర్ జిల్లాలో ఉన్న ఈ తారాపూర్ నియోజకవర్గంలో సంతోష్ కుమార్ సింగ్ అనే ఓ 48 ఏళ్ల డాక్టర్ ను జన సురాజ్ పార్టీ తరఫున పీకే బరిలోకి దింపారు.

Prashant Kishor s big plan to defeat bihar deputy cm Samrat Choudhary in tarapur

12ఏళ్లుగా డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న సంతోష్ కుమార్ సింగ్ కు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తల్లితండ్రులు ఇద్దరూ పేషెంట్లే. వీరిద్దరికీ ఆయన పర్సనల్ డాక్టర్ గా ఉన్నారు. దీంతో పీకే ఆయన్ను వ్యూహాత్మకంగా బరిలోకి దించారు. స్థానికంగా మంచి డాక్టర్ గా పేరున్న సంతోష్ కుమార్ సింగ్ ను నేరుగా విమర్శించలేక ఆయన ప్రత్యర్ది, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అపసోపాలు పడుతున్నారు. మరోవైపు సంతోష్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పీకే వ్యూహం ఫలించవచ్చని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+