ఏపీతోపాటు 12 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు: జాబితా ఇదే
దేశంలోని 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. ఇందులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ కూడా ఉంది.
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. ఇందులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ కూడా ఉంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథూర్ లు తమ పదవులకు రాజీనామా చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆ తర్వాత ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది.
తాజాగా, గవర్నర్ల నియామకంపై రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా జనరల్ కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ నియమితులయ్యారు.
సిక్కిం రాష్ట్ర గవర్నర్‌గా మాజీ బీజేపీ నేత లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య నియమితులయ్యారు.
జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా మాజీ బీజేపీ నేత సీపీ రాధాకృష్ణ
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా మరో బీజేపీ నేత శివ్ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు.
రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా అస్సాం గవర్నర్‌గా నియామకం అయ్యారు.
అయోధ్యపై పురావస్తు నివేదికను సమర్థించిన రాజ్యాంగ ధర్మాసనంలో భాగమైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు.

ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా పనిచేసిన సుశ్రీ అనుసూయా ఉక్యే మణిపూర్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు.
మణిపూర్ మాజీ గవర్నర్ లా గణేశన్ ఇప్పుడు నాగాలాండ్ కొత్త గవర్నర్.
బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్ ఇప్పుడు మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు.
గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ బీహార్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు.
జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.
గతంలో అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బ్రిగ్ (డా) బీడీ మిశ్రా (రిటైర్డ్), ఇప్పుడు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications