President election: యశవంత్ సిన్హాకు జడ్ ఫ్లస్ భద్రత, కేంద్ర హోమ్ శాఖ క్లారిటీ, బీజేపీ మాజీ లీడర్ కు !
న్యూఢిల్లీ/ కోల్ కత్తా: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి యశవంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ ఫ్లస్ భద్రత కల్పించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును పోటీకి దింపిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా అనేక మంది పేర్లు పరిశీలించారు. చివరికి యశవంత్ సిన్హా పేరును ప్రతిపక్షాలు ప్రకటించాయి.

బీజేపీ మాజీ నాయకుడు
చివరికి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నుంచి బయటకు వచ్చి టీఎంసీ పార్టీలో ఉన్న యశవంత్ సిన్హా పేరు తెరమీదకు తీసుకు వచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన యశవంత్ సిన్హా వెంటనే టీఎంసీ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి యశవంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ద్రౌపది ముర్ముకు జడ్ ఫ్లస్ భద్రత
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జడ్ ఫ్లస్ కేటగిరి కేటాయించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు ఇప్పటికే సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయిస్తున్న యశవంత్ సిన్హాకు కూడా కేంద్ర ప్రభుత్వం జడ్ ఫ్లస్ భద్రత కల్పించింది.

కేంద్ర హోమ్ శాఖ క్లారిటీ
కేంద్ర మాజీ మంత్రి, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశవంత్ సిన్హాకు 8 నుంచి 10 మంది సీఆర్ పీఎఫ్ సిబ్బంది భద్రత కల్పిస్తారని, ఆయనకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచించిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం మీద రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ము, యశవంత్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం జడ్ ఫ్లస్ భద్రత కల్పించింది.












Click it and Unblock the Notifications