ఐసీయూ నుండి ప్రత్యేక గదికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ .. కోలుకుంటున్నారన్న రాష్ట్రపతి భవన్ వర్గాలు
భారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రధమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ ఎయిమ్స్‌లో కార్డియాక్ బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఛాతీలో కలిగిన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రామ్ నాథ్ కోవింద్ కు మార్చి 30వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ లో కార్డియాక్ బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) నుంచి ప్రత్యేక గదికి తరలించినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు . ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని అన్నారు.
భారత రాష్ట్రపతి కోవింద్ ను ఈ రోజు ఎయిమ్స్ లోని ఒక ప్రత్యేక గదికి తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. వైద్యులు అతని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మరియు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు అని ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు రాష్ట్రపతి భవన్ వర్గాలు .

భారతదేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (75) మార్చి 30 న ఢిల్లీ ఎయిమ్స్ వద్ద కార్డియాక్ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఛాతీ అసౌకర్యం గురించి ఫిర్యాదు చేయడంతో ఆరోగ్య పరీక్షల తరువాత ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. దీంతో ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.
కోవింద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. అప్పటి బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి అధ్యక్షుడు కోవింద్ కొడుకుకు కాల్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి పై వాకబు చేశారు .
శస్త్రచికిత్స తర్వాత ఒక రోజు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తాను బాగా కోలుకుంటున్నానని ట్వీట్ చేశాడు . తనను చూసుకున్న వైద్యులు మరియు సంరక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. బైపాస్ సర్జరీ తర్వాత నేను బాగా కోలుకుంటున్నాను, వైద్యులు మరియు వైద్య సిబ్బంది యొక్క అద్భుతమైన అంకితభావానికి కృతజ్ఞతలు. భారతదేశ, విదేశాల నుండి వచ్చిన పౌరులు , ఇతర నాయకులు, తాను త్వరగా కోలుకోవాలని తనపై అభిమానం చూపించడం పై స్పందించిన ఆయన మీ అందరికీ నా కృతజ్ఞతలు! "అని రాష్ట్రపతి కోవింద్ అధికారిక హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications