వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్‌నాథ్ నామినేషన్: చంద్రబాబు సంతకం, కేసీఆర్-అద్వానీ హాజరు

ఎన్డీయే తరఫున రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్డీయే తరఫున రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులు హాజరయ్యారు.

చదవండి: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేదే గెలుపు!

తొలి సెట్ పైన ప్రధాని నరేంద్ర మోడీ సంతకం చేశారు. రెండో సెట్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మూడో సెట్‌పై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, నాలుగో సెట్‌పై బాదల్ సంతకం చేశారు. ప్రతి నామినేషన్ సెట్‌పై ప్రతిపాదిస్తూ 50 మంది, మద్దతు తెలుపుతూ మరో 50 మంది సంతకాలు చేశారు.

Presidential Election 2017: Ram Nath Kovind files his nomination in Narendra Modi's presence

హాజరైన అద్వానీ

నామినేషన్ కార్యక్రమానికి బిజెపి అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులు హాజరయ్యారు. ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులు వచ్చారు.

Presidential Election 2017: Ram Nath Kovind files his nomination in Narendra Modi's presence

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తమిళనాడు సీఎం పళనిస్వామి, యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యారు. యోగి, చంద్రబాబులు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

English summary
Ram Nath Kovind files his nomination in Narendra Modi's presence. LK Adavni also attend.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X