వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

DRDO 2DG drug: మరీ అంత రేటా: శాచెట్ ధరను నిర్ధారించిన డాక్టర్ రెడ్డీస్: డిస్కౌంట్ కూడా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని ప్రాణాంతక కరోనా వైరస్ గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. డ్రగ్ కంట్రోలర్ డైరెక్టర్ జనరల్ ఇదివరకే అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2DG) వైద్య అవసరాల కోసం జూన్‌లో మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది. ఇటీవలే దీన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ దీన్ని విడుదల చేశారు. ఈ డ్రగ్‌ను రక్షణశాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ దీన్ని తయారు చేస్తోంది. తాజాగా దీని ధరను నిర్ధారించింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్.

Recommended Video

DRDO 2DG Drug Price : ఒక్కో Sachet Cost ఎక్కువే... డిస్కౌంట్‌ సౌకర్యం| Dr Reddy’s | Oneindia Telugu

Mehul Choksi: భారతీయుడు కాదు: ప్రధాని సూచనపై సవాల్: అప్పగింతపై సుప్రీంకోర్టు జోక్యం..స్టేMehul Choksi: భారతీయుడు కాదు: ప్రధాని సూచనపై సవాల్: అప్పగింతపై సుప్రీంకోర్టు జోక్యం..స్టే

ఒక్కో శాఛెట్ రేటు ఎక్కువే..

ఒక్కో శాఛెట్ రేటు ఎక్కువే..

శాఛెట్ రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ 2డీజీ మెడిసిన్ రేటు ఎక్కువే. ఒక్కో శాచెట్ ధరను 990 రూపాయలుగా నిర్ధారించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మెడిసిన్ వినియోగానికి డిస్కౌంట్‌ లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే- కరోనా వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం డిస్కౌంట్‌ సౌకర్యం వర్తిస్తుందని పేర్కొన్నారు. జూన్ రెండోవారం నుంచి సాధారణ మార్కెట్‌లోకి ఈ మెడిసిన్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. అదే నెల మొదటివారంలోనే 2డీజీ డ్రగ్‌ ఉత్పత్తిని రెట్టింపు చేస్తామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తెలిపింది. డిమాండ్‌కు అనుగుణంగా వాటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. డిస్కౌంట్ మొత్తం ఎంత అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

 కేంద్రమంత్రుల చేతుల మీదుగా..

కేంద్రమంత్రుల చేతుల మీదుగా..

దేశ రాజధానిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ డ్రగ్‌ శాచెట్స్‌ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తొలి పాకెట్‌ను తన మంత్రివర్గ సహచరుడు డాక్టర్ హర్షవర్ధన్‌కు అందజేశారాయన. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు ఇచ్చే ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఈ డ్రగ్‌ను డీఆర్డీఓ-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లయిడ్ సైన్సెన్ (ఇన్మాస్) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ మెడిసిన్ వల్ల పేషెంట్లు ఆక్సిజన్‌పై ఆధార పడాల్సిన పరిస్థితి తగ్గుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుందీ మెడిసిన్.

ట్రీట్‌మెంట్‌లో భాగంగా..

ట్రీట్‌మెంట్‌లో భాగంగా..

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌‌ అందించే చికిత్సలో దీన్ని వినియోగిస్తారు. ఆ పేషెంట్ త్వరగా కోలుకోవడంలో 2డీజీ డ్రగ్స్ కీలక పాత్ర పోషిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. రోగి శరీరంపై వేగవంతంగా పని చేస్తుందని క్లినికల్ ట్రయల్ ఫలితాల ద్వారా స్పష్టమైంది. అంటే ఈ మెడిసిన్ ఇవ్వగానే ఆక్సిజన్‌పై ఆధారపడటం తగ్గిపోతుంది. జెనరిక్ మోలిక్యూల్, గ్లూకోజ్‌‌ను పోలివుండే ఈ డ్రగ్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా కరోనా సోకిన పేషెంట్లకు ఇవ్వగా..వారు తక్కువ సమయంలోనే కోలుకున్నారని డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు.

 220 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్..

220 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్..

2-డీజీ డ్రగ్ పౌడర్ రూపంలో ఉంటుంది. ఓ చిన్న ప్యాకెట్‌లో ఇది లభిస్తుంది. నీటిలో కలిపి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ వల్ల శరీరంలో ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలపై దాడి చేసి వైరస్‌ను నిర్మూలిస్తుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను 220 మంది పేషెంట్లపై గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ప్రయోగించారు. ఢిల్లీ , ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో మొత్తం 27 కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రయోగం చేశారు.

English summary
The price of DRDO’s 2DG anti-COVID 19 drug has been kept at Rs 990 per sachet by Dr Reddy’s lab. Govt hospitals, central and state govt would be provided the medicine at a discounted price: Govt officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X