గడ్కరీ పనితీరు అద్భుతం: ప్రధాని మోడీ ప్రశంస
న్యూఢిల్లీ: "రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అద్భుత పనితీరును కనబరుస్తున్నారు" ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చిన మాటలు. ఈ వ్యాఖ్యలతో ఇతర మంత్రుల్లో కాస్తంత అలజడి మొదలైంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీ నేరుగా కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రి పనితీరుపై మాట్లాడలేదు కాబట్టి.
గడ్కరీపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలతో మిగితా మంత్రులు వారి వారి పనితీరును స్వయంగా సమీక్షించుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. తన క్యాబినెట్ లోని మంత్రుల పనితీరు అసంతృప్తిని కలిగిస్తోందని గడచిన 16 నెలల్లో పలుమార్లు మోడీ బహిరంగంగా కాకపోయినా, మంత్రివర్గ సమావేశాల్లో వ్యాఖ్యానించారన్న వార్తలు మీడియాలో వచ్చాయి.

అయితే తాజాగా గడ్కరీ పనితీరుపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు దశాబ్దాల నుంచి పూర్తి కాని ఎన్నో ముఖ్య ప్రాజెక్టులను 15 నెలల వ్యవధిలో గడ్కరీ పూర్తి చేశారని చెప్పడం గమనార్హం. ప్రధాని మోడీ ప్రశంసలు పొందడం వెనుక గడ్కరీ కృషి కూడా ఎంతో ఉంది.
రోజుకు కనీసం 15 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరగాలని రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలినాడే ఆదేశించిన గడ్కరీ, తన ఆదేశాలు ఎలా అమలవుతున్నాయన్న విషయమై రోజుకు ఒకసారన్నా ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారంట. తన వద్దకు వచ్చిన ప్రతి ప్రతిపాదననూ స్వయంగా పరిశీలించి అనుమతులతో పాటు నిధులు కేటాయింపు త్వరితగతిన చేస్తున్నారంట.












Click it and Unblock the Notifications