PM Kisan: రైతులకు శుభవార్త.. బ్యాంకు ఖాతాల్లో రూ.2 వేలు జమ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులకు శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత నిధులను విడుదల చేశారు. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా నుంచి 16వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 9 కోట్ల మంది రైతులకు రూ. 21 వేల కోట్లకు పైగా నగదు బదిలీ యవత్మాల్ నుంచి రిమోట్ బటన్‌ను నొక్కడం ద్వారా, PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు సాయం చేసేందుకు 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద 15 విడతలుగా రూ.30 వేలను అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. 2023 నవంబర్ లో పీఎం కిసాన్ 15 విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లు జమ చేశారు. తాజాగా 16 విడత డబ్బులను కూడా రైతలు ఖాతాల్లో జమ చేశారు.

రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు. రైతులు ముందుగా https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. వెబ్ సైట్ లో ఫార్మర్స్ కార్నర్ ఉంటుంది. అందులో ఈకేవైసీ, న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, బెనిఫిషరి లిస్ట్, నో యూవర్ స్టేటస్ తో పలు ఆప్షన్లు ఉంటాయ. బెనిఫిషరి లిస్ట్ పై క్లిక్ చేయాలి. అందులో మీ మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, విలేజ్ అడుగుతుంది. అవన్ని ఎంపిక చేయాలి. తర్వాత గేట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. అప్పుడు లిస్ట్ వస్తుంది. లిస్ట్ లో మీ పేరు ఉంటే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. 16 విడత కూడా ఈకేవైసీ చేసుకున్న వారికే వచ్చాయి. ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోకుంటే వెంటనే https://pmkisan.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ కేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతా ఆధార్ అథంటికేషన్ ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేసి సడ్మిట్ చేయాలి. అప్పుడు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయినట్లు.












Click it and Unblock the Notifications