Doctors: వైద్యం బంజేసి పానీపూరీ, జ్యూస్ అమ్ముకుంటున్న వైద్యులు..!
వైద్యులు ఏం చేస్తారు.. రోగులకు వైద్యం చేస్తారు. ఎప్పుడూ బిజీగా ఉంటూ చికిత్స చేస్తుంటారు. కానీ ఓ చోట వైద్యులు పానీ పూరీ, చాయ్, జ్యూస్ అమ్ముకుంటున్నారు. వైద్యులే కాదు.. ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది కూడా వీధి దుకాణాలు నడిపిస్తున్నారు. వైద్యం చేయకుండా వారు చాయ్, పానీపూరీ, జ్యూస్ ఎందుకు అమ్ముకుంటున్నారో తెలుసా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు పానీపూరీ, చాయ్, జ్యూస్, కోడిగుట్లు అమ్ముతూ నిరసన తెలిపుతున్నారు. అయితే వీరంతా ప్రైవేట్ ఆస్పత్రులు వైద్యులు.
రాజస్థాన్ ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం ప్రతి పౌరుడు ఎలాంటి చార్జీలు లేకుండా ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందవచ్చు. దీన్నీ వ్యక్తిరేకిస్తూ రాజస్థాన్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ జీవోను అముల చేయకూడదని వారు డిమాండ్ చేశారు. ఆర్టీహెచ్ బిల్లు తెచ్చాక ఆసుపత్రులు మూతపడే పరిస్థితి ఉందని, నిమ్మరసం అమ్ముకుని నిర్వహిస్తామన్నారు. బిల్లు రాని దాకా రోజూ బండి పెడతాం. ఆర్టీహెచ్ బిల్లు వైద్యులకే కాకుండా సామాన్య ప్రజలకు, రోగులకు కూడా హానికరమని వైద్యులు చెబుతున్నారు.

ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు గత 9 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. కేవలం ఎన్నికల కోసమే ఈ బిల్లు తెచ్చారని ప్రైవేట్ వైద్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాజస్తాన్‌లోని మొత్తం ప్రైవేట్ ఆస్పత్రులను మూసేశారు. ఈ నెల 29న దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వైద్యుల బృందాలు ఈ నిరసన కోసం రాజస్తాన్‌కు వస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
అయితే వైద్యుల నిరసనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రే తనను కలవాలని వైద్యులకు చెప్పినా.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఆదివారం మీడియా ద్వారా ప్రభుత్వం వైద్యులందరిని విధుల్లోకి వెళ్లాలని కోరినా స్పందన లేదన్నారు.












Click it and Unblock the Notifications