Student: 10వ తరగతి అబ్బాయి దారుణ హత్య, నోకామెంట్ అని తల్లి, సీసీటీవీ కెమెరాల్లో ?

బెంగళూరు/బెళగావి: 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. ఉదయం స్కూల్ కు వెళ్లిన అబ్బాయి రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు.. అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ స్కూల్ మా స్టేషన్ పరిధిలో రాదని చెప్పి కేసు నమోదు చేసుకోలేదు. మరుసటి రోజు ఉదయం వరకు అబ్బాయి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. సిటీ సమీపంలోని ఓ పొలంలో అబ్బాయి శవమై కనిపించాడు. అబ్బాయిని కత్తులతో పొడిచి తల మీద బండరాళ్లు వేసి అతికిరాతకంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. అయితే అబ్బాయి హత్య కేసులో మాట్లాడటానికి అతని కుటుంబ సభ్యులు నిరాకరించడం హాట్ టాపిక్ అయ్యింది.

10వ తరగతి అబ్బాయి

10వ తరగతి అబ్బాయి

కర్ణాటకలోని బెళగావిలోని శివాజీనగర్ లోని ప్రజ్వల్ శివానంద అలియాస్ ప్రజ్వల్ (16) అనే అబ్బాయి నివాసం ఉంటున్నాడు. బెళగావిలోని ప్రముఖ స్కూల్ అండ్ కాలేజ్ లో ప్రజ్వల్ 10వ తరగతి చదువుతున్నాడు. ప్రజ్వల్ ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నాడు. మంచి మార్కులు సంపాధించి 10వ తరగతి పాస్ అయ్యి కాలేజ్ లో చేరాలని ప్రజ్వల్ బాగా చదువుతున్నాడు.

మాయం అయిన అబ్బాయి

మాయం అయిన అబ్బాయి

ఉదయం స్కూల్ కు వెళ్లిన ప్రజ్వల్ రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. ప్రజ్వల్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ స్కూల్ మా స్టేషన్ పరిధిలో రాదని చెప్పి కేసు నమోదు చేసుకోలేదు. మరుసటి రోజు ఉదయం వరకు ప్రజ్వల్ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు.

పొలంలో శవమైన ప్రజ్వల్

పొలంలో శవమైన ప్రజ్వల్

మరుసటి రోజు బెళగావి సిటీ సమీపంలోని పొలంలో పనులు చెయ్యడానికి స్థానిక రైతులకు వెళ్లారు. ఆ సందర్బంలో ప్రజ్వల్ శవమై కనిపించాడు. ప్రజ్వల్ వేసుకున్న యూనీఫామ్, బెల్ట్, టై ఆధారంగా అతని కుటుంబ సభ్యులను పోలీసులు పిలిపించారు. హత్యకు గురైయ్యింది ప్రజ్వల్ అని అతని కుటుంబ సభ్యులు నిర్దారించారు.

నోకామెంట్.... సీసీటీవీ కెమెరాల్లో ?

నోకామెంట్.... సీసీటీవీ కెమెరాల్లో ?

ప్రజ్వల్ ను కత్తులతో పొడిచి తల మీద బండరాళ్లు వేసి అతికిరాతకంగా హత్య చెయ్యడం బెళగావిలో కలకలం రేపింది. ప్రజ్వల్ హత్య కేసులో మాట్లాడటానికి అతని కుటుంబ సభ్యులు నిరాకరించడం హాట్ టాపిక్ అయ్యింది. స్కూల్ దగ్గర ఉన్న ప్రజ్వల్ ను ఇద్దరు యువకులు బైక్ లో పిలుచుకుని వెలుతున్న విషయం ఆ రోడ్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యిందని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+