opposition parties criticism congress party priyanka gandhi center government finance minister nirmala sitharaman tweet Elections effect విమర్శలు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ తగ్గింపు ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ పర్యవేక్షణ ఎన్నికలు ప్రభావం
వడ్డీరేట్ల తగ్గింపు పొరబాటా .. లేకా ఎన్నికల జిమ్మిక్కా అన్న ప్రియాంకా గాంధీ, ఏప్రిల్ ఫూల్ జోక్ అన్న టీఎంసీ
చిన్న మొత్తాల పొదుపు ఖాతాల వడ్డీ రేట్లపై కేంద్రం నిన్న రాత్రి చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటూ పాత వడ్డీరేట్లు యధాతథంగా కొనసాగుతాయని ప్రకటించింది. ఇదే సమయంలో నిర్మల సీతారామన్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందన్న భయంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ విమర్శలు
పొరపాటున వడ్డీరేట్ల తగ్గింపు ఉత్తర్వులు ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించడం పై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ రోజు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ప్రశ్నించారు. 2020-2021 ఆర్థిక సంవత్సరపు చివరి రోజు నిన్న ప్రకటించిన రేట్ల తగ్గింపును ఉపసంహరించుకుంటూ ఈ రోజు తెల్లవారుజామున మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆమె ట్వీట్ చేశారు. నిజంగానే పొరపాటున తగ్గింపు ఆదేశాలిచ్చారా లేక ఎన్నికల జిమ్మిక్కా అంటూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.

మధ్యతరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఫూల్ జోక్ తో ఆడుకుంటుంది : టీఎంసీ నేత
పశ్చిమ బెంగాల్‌లో బిజెపితో తీవ్రంగా పోరాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసింది. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టే దేశీయ మధ్యతరగతి ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఫూల్ జోక్ తో ఆడుకుంటుంది అంటూ ట్వీట్ చేశారు. ఈ రోజు రెండో దశ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీపై విమర్శలకు అస్త్రం దొరికింది.

ఆర్ధిక మంత్రిగా కొనసాగే అర్హత లేదు : రణదీప్ సుర్జేవాలా
కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా కేంద్రం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడం ఫైనాన్స్ మినిస్టర్.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతు న్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల మందిని ప్రభావితం చేసే ప్రభుత్వ ఆర్డర్ ని ఎలా పొరబాటుగా ఇస్తారంటూ ప్రశ్నించారు . మీకు దేశ ఆర్థిక మంత్రిగా కొనసాగే అర్హత లేదని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
ఇలా ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఆర్ధిక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని , ఆపై యూటర్న్ ను టార్గెట్ చేస్తున్నారు .

పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్ల తగ్గింపు , ఆపై యూటర్న్ .. కేంద్రంపై ప్రతిపక్షాల టార్గెట్
చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ నిన్న తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఈరోజు యూటర్న్ తీసుకుంది. ఈ రోజు నుండి అమల్లోకి రావాల్సిన చిన్న పొదుపు రేట్ల తగ్గింపును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించబడతాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం ఉదయం చెప్పారు.నిన్న తీసుకున్న నిర్ణయం పొరబాటున తీసుకున్నామని చెప్పటంతో ప్రతిపక్ష పార్టీలు కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి.