ప్రియాంక గాంధీ ఫీట్లు.. బారికేడ్ల పైనుంచి దూకి.. జనంతో కలిసి (వీడియో)

భోపాల్ : నానమ్మ ఇందిరాగాందీ పోలికలతో ఉందంటూ అందర్నీ ఆకట్టుకుంటున్న కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ క్షేత్రస్థాయిలో యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. జనాలకు దగ్గరయ్యేందుకు నానమ్మ తరహాలో పోటీపడుతున్నారు. ఆ క్రమంలో సెక్యూరిటీని తోసిరాజని.. తాజాగా ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునే ఫీట్ చేశారు.

Priyanka Gandhi Jumps Over Barricade To Meet Supporters

ఎస్పీజీ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వద్దని వారించినా.. ప్రియాంక పట్టించుకోలేదు. జనాల పిలుపుతో ముగ్ధురాలైన ప్రియాంక వారి దగ్గరకు చేరి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సెక్యూరిటీ కూడా ఏమి చేయలేక పోలోమంటూ ఆమెను ఫాలో అయ్యారు.

అదలావుంటే తాను వెళుతున్న రోడ్డు మార్గంలో మోడీ మద్దతుదారులు ఆయన పేరును స్మరిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేయడంతో.. ప్రియాంకగాంధీ తన వాహన శ్రేణిని ఆపారు. నేరుగా వారి దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఈ రెండు ఘటనల్లోనూ జనాలకు దగ్గర కావాలనే ఆమె తాపత్రాయం మంచిదే ఐనా.. సెక్యూరిటీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+