వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక ఉగ్రరూపం-నానమ్మ ఇందిరను మరిపిస్తూ-44 క్రితం నాటి సీన్ రిపీట్

|
Google Oneindia TeluguNews

శతాభ్దానికి పైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఏనాటికైనా యువ నేత ప్రియాంక గాంధీయే దిక్కవుతారన్న అంచనాలు త్వరలోనే నిజమయ్యేలా కనపిస్తున్నాయి. ఇప్పటికే సోదరుడు రాహుల్ గాంధీపై ఇంటా బయటా విశ్వాసం సన్నగిల్లుతున్న నేపథ్యంలో తాజాగా యూపీలోని లఖీంపూర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఆమె దూసుకెళ్లడం, పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు చూసిన వారికి ఆమె నానమ్మ ఇందిరాగాంధీని మరిపించారనే వాదన వినిపిస్తోంది. సరిగ్గా 44 ఏళ్ల క్రితం నానమ్మ ఇందిర విషయంలోనూ దాదాపు ఇలాంటి పరిస్ధితే ఎదురైనట్లు వారు గుర్తుచేసుకుంటున్నారు.

యూపీలో ప్రియాంక జోరు

యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ జూలు విదుల్చుతున్నారు. గతంలో యోగీ సర్కార్ లో చోటు చేసుకున్న పలు పరిణామాలపై నిరసనలు తెలిపిన ప్రియాంక తాజాగా లఖీంపూర్ ఖేరీలో కేంద్రమంద్రి అజయ్ మిశ్రా కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లి నలుగురి ప్రాణాలు తీసిన ఘటనపైనా అదే స్ధాయిలో స్పందిస్తున్నారు. నిన్న రాత్రి లఖీంపూర్ ఖేరీకి బయలుదేరిన ప్రియాంకను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ప్రియాంక ఉగ్రరూపం

యూపీలోని లఖీంపూర్ ఖేరీకి వెళ్లేందుకు బయలుదేరిన ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు. ప్రియాంకతో పాటు వెళ్తున్న కాంగ్రెస్ నేతల్ని ముందుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ప్రియాంక వద్దకు కూడా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులపై కన్నెర్ర చేశారు. చేతకాని పోలీసులు తనను అడ్డుకోవాలని చూడటమేంటని వారిపై విరుచుకుపడ్డారు. దీంతో ప్రియాంకతో పాటు వెళ్తున్న వారంతా ఆశ్చర్య చకితులయ్యారు. పోలీసులు సైతం ప్రియాంక ఆగ్రహంతో ఒక్కసారిగా మౌనం వహించారు.

పోలీసులకు ప్రియాంక వార్నింగ్

తనను నిర్బంధించేందుకు ప్రయత్నించిన పోలీసులపై విరుచుకుపడిన ప్రియాంక వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు. మీరు నన్ను నిర్బంధించేందుకు ప్రయత్నిస్తే అది భౌతిక దాడి, కిడ్నాప్, వేధింపుల కిందకు వస్తుంది. మీరు వెళ్లి మీ అధికారులు, మంత్రుల నుంచి వారెంట్ తీసుకురండి అంటూ ప్రియాంక పోలీసుల్ని హెచ్చరించారు. మహిళలకు ఎలా ప్రవర్తించాలో నేర్చుకోండంటూ పోలీసుల్ని హెచ్చరించారు. మీ రాష్ట్రంలో చట్టం లేకపోయినా ఈ దేశంలో చట్టం అమల్లో ఉంది. నన్ను బలవంతంగా మీరు తరలిస్తున్నారంటూ ప్రియాంక పోలీసులతో వ్యాఖ్యానించారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు కాసేపు నిర్ఘాంతపోయి తిలకించిన పోలీసులు.. అనంతరం ఆమెను చట్టప్రకారమే అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పి అరెస్టు చేశారు.

 నానమ్మ ఇందిరలాగే గర్జించిన ప్రియాంక

నానమ్మ ఇందిరలాగే గర్జించిన ప్రియాంక

ఇప్పటికే అచ్చు నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోలికలతో పుట్టిందని, హావభావాల్ని కూడా పంచుకుందని విశ్లేషకులు భావించే ప్రియాంక గాంధీ నిన్న యూపీ పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆగ్రహంలోనూ నానమ్మ ఇందిరను మరిపించారు. పోలీసులపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో ఆమె ముఖ కవళికలు, పదునైన మాటలు గమనించిన ఆమె సహచరులు అచ్చు నానమ్మ ఇందిరలాగే గర్జించినట్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ప్రియాంక ఆగ్రహాన్ని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.

 44 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇందిర అరెస్ట్..

44 ఏళ్ల క్రితం ఇదే రోజు ఇందిర అరెస్ట్..

ప్రియాంక గాంధీ అరెస్టును కాంగ్రెస్ శ్రేణులు 1977లో జనతా ప్రభుత్వ హయాంలో జరిగిన ఇందిరాగాంధీ అరెస్టుతో పోలుస్తున్నారు. 1977లో అక్టోబర్ 3న ఇందిరాగాంధీని అరెస్టు చేసిన జనతా సర్కార్ ఆ తర్వాత రద్దయిందని, ఇప్పుడు అదే అక్టోబర్ 3న ప్రియాంక గాంధీని అరెస్టు చేసిన యోగీ సర్కార్ కు కూడా కాలం చెల్లబోతోందని కాంగ్రెస్ నేత సునీల్ జాఖడ్ ఓ ట్వీట్లో వ్యాఖ్యానించారు. మరో కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ఇదే ఘటనపై స్పందిస్తూ ఇందిర తిరిగొచ్చినట్లుుందని మరో ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు తన సోదరి ప్రియాంక గాంధీ అరెస్టుపై స్పందించిన రాహుల్ గాంధీ.. ప్రియాంక నువ్వు వెనుదిరగవని నాకు తెలుసు, వాళ్లు నీ ధైర్యం చూసి భయపడుతున్నారంటూ యోగీ సర్కార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ అహింసా పోరాటం ద్వారా మనం ఈ దేశ అన్నదాతల్ని గెలిపించబోతున్నామంటూ ట్వీట్లో తెలిపారు.

English summary
congress leader priyanka gandhi has been looked like her grandmother indira gandhi on being detained by UP police yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X