డెంగీ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూతురు ప్రియాంకాగాంధీ శుక్రవారం నాడు ఆసుపత్రిలో చేరారు. డెంగీ జ్వరంతో బాధపడుతూ ప్రియాంక ఆసుపత్రిలో చేరారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కూతురు ప్రియాంకాగాంధీ శుక్రవారం నాడు ఆసుపత్రిలో చేరారు. డెంగీ జ్వరంతో బాధపడుతూ ప్రియాంక ఆసుపత్రిలో చేరారు.
డెంగీ జ్వరంతో బాధపడుతోన్న ప్రియాంక న్యూఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రియాంక గంగారాం ఆసుపత్రిలో చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి ఛైర్మెన్ డిఎస్ రాణా చెప్పారు.

గడిచిన నెలరోజులుగా ఢిల్లీ వ్యాప్తంగా డెంగీ, విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారంగా డెంగీ బారినపడి వివిధ ఆసుపత్రుల్లో చేరారు.
ఆసుపత్రుల్లో చేరినవారిలో 325 మంది ఢిల్లీ నగరానికి చెందినవారే కావడం గమనార్హం. రోజు రోజుకు డెంగీ కేసులు పెరుగుతుండడంతో న్యూఢిల్లీ మున్సిఫల్ కౌన్సిల్ పని తీరుపై విమర్శలు పెరిగాయి.












Click it and Unblock the Notifications